బుల్లితెర రియాలిటీ షో ‘బిగ్ బాస్ సీజన్ 4″ లో స్టార్ కటెస్టంట్ గంగవ్వ. ఆమె కోసం బిగ్ బాస్ స్పెషల్ కేర్ తీసుకుంటున్నట్టు తెలుస్తుంది. మొదటిరోజు షోలోని కంటెస్టెంట్స్ తో కలిసేందుకు కాస్త ఇబ్బంది పడిన గంగవ్వ ఇప్పుడు అందరిని కలుపుకుంటూ హుషారుగా పాల్గొంటుంది. 63 ఏళ్ల బామ్మ హౌస్‌లో ఏం చేస్తుందులే అనుకున్నారంతా.. కాని హౌస్‌లోకి వచ్చిన తరువాత బిగ్ బాస్ స్వరూపాన్నే మార్చేసింది. తన ఆటపాటలతో బిగ్ బాస్ హౌస్‌ని అల్లాడిస్తోంది. తనదైన తెలంగాణా యాసలో అందరినీ ఆకట్టుకుంటుంది. హౌస్‌లో బెస్ట్ పెర్ఫామర్ అనిపిస్తుంది. “బిగ్ బాస్ హౌస్” సభ్యులు కూడా ఆమెకు బాగానే సపోర్ట్ గా ఉంటున్నారు. బిగ్ బాస్ హౌజ్ లో ఈ సీజన్ క్రేజీ కంటెస్టంట్ గా మారుతున్నారు గంగవ్వ.

ఆల్రెడీ బయట ఆడియెన్స్ లో ఆమె మీద ఓ పాజిటివ్ ఫీలింగ్ వచ్చింది. గంగవ్వ లేని బిగ్ బాస్ హౌస్.. ఉప్పులేని కూర.. హీరో లేని సినిమా మాదిరే ఉంటుందని ఈ షో చూసే ప్రతి ప్రేక్షకుడి భావన. అంతలా ఈ షోని ఓన్ చేసుకుంది ముసలి అవ్వ గంగవ్వ. ఇదిలాఉండగా ఓటింగ్‍ ద్వారా గంగవ్వ ఎలిమినేషన్‍ జరగడం ఇంపాజిబుల్‍ అనే విషయం ఇప్పటికే అర్ధమైపోయింది. ఆమెపై సానుభూతితోనే జనం ఓట్లు గుద్దేస్తున్నారు కనుక ఆమె రెగ్యులర్‍ పద్ధతిలో బయటకు వచ్చే ఛాన్స్ లేదు. ఈ సంగతి బిగ్‍బాస్‍ నిర్వాహకులకు కూడా తెలుసు. మరి ఆమె 15 వారాల పాటు హౌస్‍లో వుండి విజేతగా బయటకు వస్తుందా? పల్లెటూర్లో ఆరుబయట తిరుగుతూ, పొలం పనులు చేసుకుంటూ కాలక్షేపం చేసే వృద్ధురాలికి అలా ఒకే ఇంట్లో అపరిచితులతో అన్ని రోజులుండడం జరిగే పని కాదు. కాబట్టి బిగ్‍బాస్‍ షో నిర్వాహకులు ఆమెను 5 వారాల పాటు వుండాలని ముందే చెప్పారట. కానీ మొదటి వారానికే అవ్వకు ఇంటిపై బెంగ మొదలైంది.

బిగ్ బాస్ ప్రారంభ ఎపిసోడ్‌లోనే “నేను బిగ్ బాస్ ఎక్కడ గెలుస్తాను సారూ.. ఎవరికి రాసిపెట్టి ఉంటే వాళ్లు గెలుస్తారని చెప్పిన గంగవ్వ.. శనివారం నాటి ఎపిసోడ్‌లో తాను బిగ్ బాస్ హౌస్‌లో ఉండటం కష్టం అని తేల్చేసింది.ఇప్పటికే బిగ్ బాస్ హౌస్ లో అన్యమనస్కంగా వుంటూ నాగార్జునతోనే 2సార్లు బయటకు పంపుర్రి అంటూ అర్జీ పెట్టుకుంది. నాగార్జున కూడా లేటెస్ట్ ఎపిసోడ్‌లో ఎలా ఉన్నావ్ గంగవ్వా అని పలకరిస్తే.. ‘బాగానే ఉన్నాను కాని.. నిద్ర పట్టడం లేదు. నేను ఏదో పిల్లలతో కలిసి కాలం గడిపేదాన్ని.. బిగ్ బాస్ ఇంటిని చూసి రావాలని వచ్చాను కానీ., ఇక్కడే ఉండాలని కాదు. 2,3 వారాలైతే ఉంటా.. నన్ను మంచిగా చూసుకుంటున్నారు కాదనడంలేదు. నేను ఇక్కడ నుంచి వెళ్లలేను కాని.. మీరే ఫ్రీగా పంపించాలి’’ అని తన బాధను చాలా ఎమోషనల్‌గా చెప్పుకొచ్చింది గంగవ్వ. “అదేంటి గంగవ్వా.. నిన్ను ఎప్పుడు పంపించాలనే నిర్ణయం నాది కాదు.. హౌస్ మెంబెర్స్ దీ కాదు.. ఆ విషయాన్ని ప్రేక్షకులు డిసైడ్ చేస్తారు.. అప్పటి వరకూ నువ్వు బిగ్ బాస్ హౌస్ లోనే ఉండాలి.. నువ్వేదైనా మాట్లాడుకోవాలి అంటే వాళ్లతోనే మాట్లాడుకో.. నాకు ఒంట్లో బాలేకపోతే వెళ్లిపోతాను.. అంటున్నావు.. అదేం కుదరదు. మా వాళ్లు నిన్ను బాగా చూసుకుంటారు” అని భరోసా కల్పించే ప్రయత్నం చేసినా గంగవ్వ తన అభిప్రాయాన్ని కుండబద్దలు కొట్టినట్టు చెప్పేసింది.

సూర్యకిరణ్‍ వెళ్లిపోతుంటే కూడా తనను పంపేసి అతడిని వుంచమని చెప్పింది. అయితే ముందే అనుకున్న అగ్రిమెంట్‍ ప్రకారం 5 వారాల పాటు గంగవ్వ బిగ్ బాస్ హౌస్ లో వుంటుందా.? అనేది అనుమానమే. 3వ వారంలో ఆమె స్వచ్ఛందంగా బయటకు వచ్చే ఛాన్స్ ఉందని టాక్ వినిపిస్తోంది. ఇదిలావుంటే గంగవ్వను బిగ్‍బాస్‍ రెగ్యులర్‍ కంటెస్టెంట్‍గా లెక్కించలేదు. అందుకే మొదటి వారంలోనే ఎక్స్ ట్రా ప్లేయర్‍ను లోపలకు పంపించారు. గంగవ్వ బయటకు వచ్చిన వారంలో మరో వైల్డ్ కార్డ్ ఎంట్రీ జరుగుతుందని తాజా సమాచారం. మరి ఈలోపు బిగ్ బాస్ షోను రసవత్తరంగా కొనసాగించడానికి ఎలాంటి ప్రయత్నాలు చేస్తారో వేచి చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here