Garikapati Narasimha Rao : నిత్యం ఎన్నో అంశాల మీద ప్రవచనాలు చెప్పే గరికపాటి గారు ప్రస్తుత సమాజ పోకడల గురించి వ్యంగ్యంగా మాట్లాడుతూ వాటి పర్యవసానం కూడా వివరిస్తూ ఉంటారు. అలానే ఒక సభలో ఆడవారి వస్త్రధారణ గురించి మాట్లాడారు. అయితే ఇప్పుడు ఈ విషయం మహిళా సంఘాల నేతల అగ్రహానికి గురిచేసింది. ఆడవాళ్లు చీర కట్టుకోవాలి, ఉద్యోగం కోసం బయటికి వెళితే అక్కడ మగవాళ్ళను రాసుకు పూసుకు తిరిగితే మగవాళ్లు ఏమవ్వాలి అంటూ గరికపాటి గారు కామెంట్స్ చేసారు అంటూ మహిళా నేతలు ఫైర్ అవుతున్నారు.

నిన్ను తన్నినా పాపం లేదు…
ఇక ఈ కామెంట్స్ గురించి మహిళా సంఘ నాయకురాళ్లు మాట్లాడుతూ అంటే ఆడవాళ్ళ పట్ల చులకన భావం ఉంది గారికపాటికి అంటూ ఆగ్రహం వ్యక్తం చేసారు. చీర కట్టుకుంటే ఏమి కనపడాలో అవి కనిపిస్తాయి అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలను తప్పు బడుతూ ఆడవాళ్ళ నడుము మడతలు కనిపించాలా నీకు ఈ వయసులో, ఇపుడే ఇలా ఉన్నావంటే యువకుడిగా ఎన్ని అఘాయిత్యాలకి పాల్పడి ఉంటావో. ఇలాంటి వాళ్ళను క్షమాపణలు అడగమని కోరడం కాదు కొట్టినా తప్పు లేదు.

జస్టిస్ రమ కమిషన్ మేరకు ఆడవారి గురించి అసభ్యంగా మాట్లాడినా నిర్భయ కేసు కింద అరెస్టు చేయొచ్చు. గరికపాటి మీద కూడా అలాంటి కేసు నమోదు చేయాలి. ప్రవచనాల పేరుతో ఆడవావరిని కొంచపరిచేలా మాట్లాడుతున్నారు. మేము ఎలాంటి బట్టలు వేసుకుంటే ఆయనకు ఎందుకు అంటూ మహిళా సంఘం నేతలు ఫైర్ అయ్యారు.



























