Garikapati Narasimha Rao:గత కొద్ది రోజుల నుంచి గరికపాటి నరసింహారావు పెద్ద ఎత్తున వార్తల్లో నిలుస్తున్నారు.ఈయన దసరా పండుగ సందర్భంగా హైదరాబాదులో నిర్వహించిన ఓ కార్యక్రమంలో భాగంగా చిరంజీవిపై చేసినటువంటి వ్యాఖ్యలు పెద్ద ఎత్తున వివాదానికి కారణమయ్యాయి.ఇకపోతే ఈ కార్యక్రమంలో భాగంగా చిరంజీవి గురించి అసహనం వ్యక్తం చేయడంతో గరికపాటి పై తీవ్రస్థాయిలో ట్రోలింగ్స్ వచ్చాయి.

ఇక ఈ గొడవ సద్దుమనిగిందనే లోపు వర్మ ఈ విషయంపై స్పందిస్తూ మరోసారి వివాదానికి అగ్గి రాశారు. ఈ క్రమంలోనే గరికపాటి పై తీవ్రస్థాయిలో అసహనం వ్యక్తం చేస్తూ వరుస ట్వీట్లతో రెచ్చిపోయారు. ఇలా వర్మ గరికపాటిపై ఆగ్రహం వ్యక్తం చేయడమే కాకుండా పాత విషయాలను కూడా బయట పెడుతూ పెద్ద ఎత్తున గరికపాటి పై విమర్శలు చేస్తున్నారు.

ఈ క్రమంలోనే గరికపాటి గతంలో నటి అనుష్క అందం గురించి చేసినటువంటి రొమాంటిక్ కామెంట్లు గురించి వర్మ ఈ సందర్భంగా బయటపెట్టారు. ఈ వీడియోలో భాగంగా గరికపాటి మాట్లాడుతూ…సినిమా ఇండస్ట్రీలో ఉండే హీరోయిన్స్ కోసం కుర్రకారులు ఎందుకు ఎగబడతారు అందులో అంతగా ఏముంది అనుకునేవాడిని అయితే ఒక రోజు నేను పొలిటికల్ న్యూస్ చదువుతుండగా మావాడు వచ్చి సినిమా పేపర్ తీసుకున్నాడు అలా నాకు వాళ్ళ దగ్గర కూర్చుంటే నా కాళ్లకు నమస్కరిస్తాడేమో అనుకున్నా కానీ అందులో వాడు ఒక హీరోయిన్ ఫోటో చూస్తూ ఉన్నాడని తెలిపారు.
OHO !!! MEEKU KOODAANAAA BAHU(GARIKA)BALI(PATI) GAARU ! ???? pic.twitter.com/00rLB4oVj7
— Ram Gopal Varma (@RGVzoomin) October 12, 2022
Garikapati Narasimha Rao: అనుష్క అందం ఆకర్షించింది…
స్వతహాగా తాను కవి కావడంతో నేను కూడా అమ్మాయి వంక ఏగాదిగా చూశాను. కానీ ఆ అమ్మాయి అందం నన్ను ఆకర్షించింది అంటూ ఈయన హీరోయిన్ అనుష్క అందం గురించి చేసినటువంటి కామెంట్లకు సంబంధించిన వీడియో వర్మ సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. ఇక ఈ వీడియోని వర్మ సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ ఓహో !!! మీకు కూడనా బహు(గరిక)బలి(పతి) గారు అంటూ చమత్కరించారు ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారినే.



























