Mahesh Babu: నందమూరి బాలకృష్ణ ఆహా వేదికగా నిర్వహిస్తున్న అన్ స్టాపబుల్ కార్యక్రమం గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమోను నిర్వాహకులు విడుదల చేశారు. ప్రస్తుతం ఈ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఫిబ్రవరి 4వ తేదీ ప్రసారమయ్యే ఈ కార్యక్రమానికి సంబంధించిన ఈ ప్రోమోలో సూపర్ స్టార్ మహేష్ బాబు డైరెక్టర్ వంశీ పైడిపల్లి పాల్గొన్నారు.

ఈ ప్రోమోలో భాగంగా ముందుగా బాలయ్య జనాల మధ్యలో కూర్చొని మహేష్ బాబు డైలాగ్ ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుందో అతడే అంటూ మహేష్ బాబు గ్రాండ్ గా వెల్ కమ్ చెప్పారు. ఇక ఈ కార్యక్రమంలో భాగంగా బాలకృష్ణ మహేష్ బాబుతో సరదాగా మాట్లాడుతూ వేదిక మొత్తం నవ్వులు పూయించారు.

ఈ క్రమంలోనే డైరెక్టర్ వంశీ పైడిపల్లినీ సైతం ఈ కార్యక్రమానికి ఆహ్వానించారు.వంశీ పైడిపల్లి వేదికపైకి రాగానే మిమ్మల్ని చూస్తుంటే చాలా భయమేస్తుంది సర్ అంటూ బాలకృష్ణతో చెప్పారు. ఎందుకు భయం అని బాలకృష్ణ అడగగా..మొన్నే అఖండ సినిమా చూశామని వంశీ పైడిపల్లి చెప్పుకొచ్చారు.
అలా పుట్టిందే ఆ ఆలోచన..
ఇక ఈ కార్యక్రమంలో భాగంగా మహేష్ బాబు సహాయం తీసుకొని ఎంతో ఆరోగ్యంగా బ్రతికిన చిన్నారులు వారి తల్లిదండ్రులను బాలకృష్ణ వేదికపైకి ఆహ్వానించారు. ఈ క్రమంలోనే ఆ తల్లిదండ్రులు వారి చిన్నారులను తీసుకొని మహేష్ బాబును చూసి కన్నీటి పర్యంతమయ్యారు. ఇక ఈ వేదికపై మహేష్ బాబు మాట్లాడుతూ గౌతమ్ ఆరు వారాల ముందు పుట్టారు. గౌతమ్ పుట్టినప్పుడు నా అరచెయ్యి అంత మాత్రమే ఉన్నాడు. ఇప్పుడు ఆరడుగులు ఉన్నాడు. గౌతమ్ నీ అలా చూసినప్పుడు సరే మాకు డబ్బు ఉంది.. ఇతరులు పరిస్థితి ఏంటి అని ఆలోచన వచ్చింది అలా పుట్టిందే ఈ ఆలోచన అంటూ మహేష్ బాబు ఎమోషనల్ అయ్యారు. ఇలా మహేష్ బాబు సొంత ఖర్చులతో సుమారు వెయ్యి మందికి పైగా చిన్న పిల్లలకు హార్ట్ ఆపరేషన్లు చేయించుకున్న సంగతినీ ఈ వేదికపై బాలయ్య బాబు తెలియజేశారు. ఇలా ఈ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక పూర్తి ఎపిసోడ్ ప్రసారం కావాలంటే ఫిబ్రవరి 4వ తేదీ వరకు వేచి చూడాలి.




























