Geetha Krishna : సంకీర్తన సినిమాతో ఇండస్ట్రీ కి డైరెక్టర్ గా పరిచయమైన గీతాకృష్ణ అటు తెలుగు ఇటు తమిళంలో కొన్ని సినిమాలు తీశారు. సంకీర్తన సినిమాకు నంది అవార్డు కూడా వచ్చింది. ఇక కోకిల, కీచు రాళ్లు, టైం, సర్వర్ సుందరం గారి అబ్బాయి ఇక లేటెస్ట్ గా నిమిదంగల్ సినిమా తీసినా అది కూడా ఒక విఫల ప్రయత్నమే అయ్యింది. ఇక సినిమాలు తీయడం మానేసి ఇంటర్వ్యూ లతో కాలక్షేపం చేస్తున్నాడు.

బోయపాటా వాడెవడో నాకు తెలీదు…
ప్రతిసారి హీరోలను, ఇప్పటి డైరెక్టర్లను, సినిమాలను కామెంట్ చేస్తున్న గీతాకృష్ణ కొరటాల శివ ఆచార్య సినిమా ప్లాప్ గురించి మాట్లాడారు. అంతకుముందు అన్ని సినిమాలు హిట్ అయినా ప్లాప్ అయినా ఆ ఒక్క సినిమానే చూస్తారు. డైరెక్టర్ కానీ, హీరోకి కానీ అతను తీసిన ముందు సినిమానే అతని విలువ, ఎన్ని హిట్స్ అంతకుముందు ఉన్నా లేటెస్ట్ సినిమా ఏంటి అనే అడుగుతారు. అలానే కొరటాల కి అయినా, రామ చరణ్ కి అయినా అంటూ మాట్లాడారు. ఇక బోయపాటి ప్రస్తావన వచ్చినపుడు నాకు అతను తెలియదు. అతని సినిమాలు చూడలేదని వినయ విధేయ రామ సినిమా ప్లాప్ అని చెబితే యావరేజ్ అంట కదా కాకపోతే అతడి సినిమాలు చాలా లౌడ్ గా ఉంటాయని విన్నాను అంటూ చెప్పాడు.

ఇక యాంకర్ అనసూయ గురించి ఆమె డ్రెస్సింగ్ వళ్ళ వచ్చే ట్రోలింగ్ గురించి స్పందించమని అడగగా అది తన ఇష్టం అంటూ, కోటా గారు అనసూయ గురించి చేసిన వాఖ్యలకు ముసలోడికి దసరా పండగ అంటూ వాఖ్యణించారు. అ అమ్మాయి చాలా అందంగా ఉంటుంది, మంచి పర్సనాలిటీ, తాను సినిమాల్లో మంచి పాత్రలు చేస్తోంది. ఇటీవల పుష్పలో చేసిన పాత్ర చాలా బాగుంటుంది అంటూ మాట్లాడారు. ఇక జబర్దస్త్ చూడనని అబ్బాయిలు అమ్మాయిల గెటప్ వేసుకుని చేయడం నాకు నచ్చదని ట్రాన్స్ జెండర్స్ ను అవమానించినట్లు అనిపిస్తుందని, కామెడీ చేసినట్లు కాకుండా వల్గర్ గా అనిపిస్తుందంటూ జబర్దస్త్ పై తన అభిప్రాయం చెప్పాడు.



























