Geetha Krishna : ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ నరేష్, పవిత్ర లోకేష్ ల వివాదం దీంట్లో మరి ముఖ్యంగా నరేష్ అతని మూడో భార్య రమ్యతో గొడవ. ఈ ఇష్యూల వళ్ళ జనాలకు తెలిసిన కొత్త విషయం నరేష్ కు మూడు పెళ్లిళ్లు జరిగాయని. ఇక ఈ మూడో పెళ్లి కూడా పెటాకులు అయిందని. ఇపుడు నాలుగో పెళ్లి పవిత్ర లోకేష్ ను చేసుకోబోతున్నాడు అంటూ పెద్ద చర్చ జరిగిన ఆధ్వర్యంలో విషయాన్ని నరేష్ ను అడిగినా ఆయన బయట చాలా మంది ఇలా చాలా పెళ్లిళ్లు చేసుకున్నారు, మేము సెలబ్రిటీలు కాబట్టి మా విషయాలు బయటికి వస్తాయి అంటూ చెప్పారు. ఎంత మానసిక క్షోభ అనుభవిస్తే విడాకులు తీసుకుని విడిపోతారు అంటూ మాట్లాడారు.

పవన్ తో నరేష్ పెళ్లిళ్ల పోలిక…
నరేష్ మూడు పెళ్లిళ్ల ముచ్చటను ఇపుడు సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్లతో పోలుస్తూ ట్రోల్ చేయడం జరుగుతోంది. ఇక ఈ విషయంపైన డైరెక్టర్ గీత కృష్ణ తనదైన శైలిలో స్పందించారు. నరేష్ రమ్య ల విషయం లో రమ్య చీటర్ లా కనిపిస్తోందని చెప్పారు. నరేష్ ప్రాపర్టీ కోసం ఇలా చేస్తోందని ఎనిమిదేళ్లుగా వేరున్నపుడు అతను ఎవరితో ఉంటే ఆమెకు ఎందుకు, విడాకులు తీసుకుంటే అయిపోతుంది కదా, అతన్ని చెడుగా ప్రాజెక్ట్ చేయడం ఎందుకు అంటూ అన్నారు.

ఇక పవన్ తో నరేష్ పెళ్లిళ్ల వ్యవహారం పై ఇద్దరినీ పోల్చకూడదు. పవన్ కళ్యాణ్ విడిపోతే ఇలా పంచాయతీ చేయలేదు. ఏ అమ్మాయి రోడ్ మీదకు వచ్చి రచ్చచేయలేదు. పవన్, నందినితో విడిపోయినపుడు, రేణు దేశాయ్ తో విడిపోయినపుడు వారికి ప్రాపర్టీ ఇచ్చాడు. పిల్లల బాధ్యత కూడా తీసుకున్నాడు. తనతో విడిపోయిన మొదటి, రెండవ భార్యలనుండి అతని పై ఎలాంటి ఫిర్యాదు లేదు కదా మరి పవన్ తో నరేష్ విషయాన్ని ఎలా పోలుస్తారు. నరేష్ విషయాన్ని ఇంతదాకా తెచ్చుకోకుండా, రమ్య కి నరేష్ కి పుట్టిన బిడ్డకు కొంత ఆస్తి ఇచ్చి విడాకులు తీసుకుంటే బాగుంటుంది అంటూ చెప్పారు గీతా కృష్ణ.































