Geetha Krishna: అసలు చాలా మందికి ఎవరో కూడా తెలియని ఈ డైరెక్టర్ గీతాకృష్ణ యూట్యూబ్ లో రోజు ఎవరో ఒక సెలబ్రిటీ గురించి స్పందిస్తూ వైరల్ అవుతున్నాడు. తాజాగా ఇప్పుడు జబర్దస్త్ గురించి మాట్లాడారు. నేను జబర్దస్త్ చూడను అంటూనే ఆ షో గురించి సంచలన వాఖ్యలు చేసాడు. అనసూయ బాగుంటుందంటూ ఆమె సినిమాల్లో బాగా నటిస్తోంది మంచి పర్సనాలిటి తనది అంటు మొన్నా మధ్య పొగిడాడు గీతా కృష్ణ.

జబర్దస్త్ ఒక బూతు షో…సుధీర్ ఎవరో తెలియదు…
ఇక జబర్దస్త్ గురించి తనకు మంచి అభిప్రాయం లేదని, రామోజీరావు గారు జబర్దస్త్ విషయంలో సర్దుకుపోయారు అనిపిస్తుంది. అదొక బూతు షో, వెకిలి చేష్టలతో మగవాళ్ళు ఆడవాళ్ళ గెటప్ లు వేసుకుని ఛండాలంగా చేస్తుంటారు. ఇక ఆ షోలో హైపర్ ఆది, సుధీర్ ల గురించి తెలుసా అని అడుగా గీతా కృష్ణ నేను జబర్దస్త్ చూడను, వాళ్లెవరో నాకు తెలియదు అని చెబుతూ సినిమా అవకాశాల కోసం జబర్దస్త్ వీడిపోతుండడం పైనా స్పందించారు. ఇంతకంటే మెరుగైన కెరీర్ ఉంటే ఎవరైనా వెళ్తారు.

సినిమాలో రానించగలిగితే మరిన్ని అవకాశాలతో కెరీర్ లో దూసుకుపోతారు కాబట్టి వెళ్లడంలో తప్పులేదు. కానీ అలా వెళ్ళాక సినిమాల్లో అంతగా క్లిక్ అవ్వకపోతే మళ్ళీ జబర్దస్త్ దిక్కవుతుంది. సినిమా ఈవెంట్లలో వెకిలిచేష్టలు చేసినంత మాత్రాన సినిమా ఆఫర్లు రావు అంటూనే సుధీర్ ఎవరో తెలియదన్న గీతా కృష్ణకి ప్రదీప్ మాత్రం తెలుసట, అతను సినిమా కూడా తీసాడు కదా అంటు మాట్లాడటం విడ్డూరం, అయినా వాళ్లెవరో తెలియనప్పుడు కామెంట్స్ ఎందుకు చేయడం.

































