Geetha Singh : ‘ఎవడి గోల వాడిది’ సినిమాతో కమెడియన్ గా అడుగుపెట్టిన గీత సింగ్ అంతకు ముందు తేజ గారి సినిమా ‘జై’ లో నటించింది. ఇక ఎవడి గోల వాడిది సినిమాతో గుర్తింపు తెచ్చుకున్నా ఆ తరువాత ‘కితకితలు’ సినిమాతో హీరోయిన్ గా మంచి సక్సెస్ అందుకుంది. ఆ సినిమా క్రేజ్ తో వరుసగా సినిమాలను చేసిన గీత సింగ్ దాదాపు ఐదు వందలకు పైగా సినిమాల్లో నటించింది. ప్రస్తుతం సినిమాలలో ఎక్కువగా కనిపించని గీత గ్యాప్ రావడానికి గల కారణాలను వివరిస్తూ తన వ్యక్తిగత విషయాలను కూడా తాజాగా ఇంటర్వ్యూలో పంచుకున్నారు.

రెండు సార్లు సూసైడ్ అట్టెంప్ట్ చేశా…
గీత నార్త్ ఇండియన్ అయినా నిజామాబాదు లో పుట్టి పెరిగింది. ఇక తాను తేజ గారి సినిమా ఆడిషన్స్ అని తెలిసీ ప్రయత్నిద్దామని వెళ్లి జై సినిమాలో హీరోయిన్ ఫ్రెండ్ పాత్రకు సెలెక్ట్ అయింది. ఇక ఈవివి గారి ఎవడి గోల వాడిది, కితకితలు సినిమాలు తన సినిమా కెరీర్ ను మలుపు తిప్పాయి. అయితే మొదట్లో అవకాశాలు బాగా వచ్చినపుడు సంపాదించిన డబ్బు ను చీటీ వేస్తే అందులో మోసపోవడం వల్ల డబ్బు నష్టపోయానంటూ చెప్పింది గీత. ఇక ఆ తరువాత సినిమా అవకాశాలు మెల్లగా తగ్గడం వల్ల గ్యాప్ వచ్చిందని చిన్నప్పటి నుండి తల్లి లాగా పెంచిన మేనత్త మరణం బాగా క్రుంగదీసిందంటూ చెప్పారు. ఏడాది పాటు డిప్రెషన్ లో ఉండిపోయానని ఎమోషనల్ అయ్యారు. ఇక తండ్రి, సోదరుడి మరణం బాగా బాధించిందని ఆర్థికంగా కూడా మోసపోవడం, కుటుంబ సభ్యుల మరణంతో ఆత్మహత్య చేసుకోవాలని రెండు సార్లు ప్రయత్నించాను కానీ నా స్నేహితురాలు కాపాడింది అంటూ గీత ఎమోషనల్ అయింది.

ఇక ఒక సమయంలో పెళ్లి ఆలోచన ఉండేది అపుడు ఇంట్లో మేనత్త మరణం ఇలా ఇబ్బందుల్లో ఉండి చేసుకోలేదు. ఇక అన్న కొడుకును అప్పటికే పెంచుకుంటూ ఉండగా ఇక ఆయన మరణం తరువాత అన్న ఇంకో బిడ్డను అలాగే మరో కజిన్ బిడ్డను అందరి బాధ్యత నేనే తీసుకున్నాను. ఇక పెళ్లి వద్దు పిల్లలను పెంచి వారిని సెటిల్ చేయాలని నిర్ణయం తీసుకున్నాను అంటూ చెప్పారు. ఇప్పటికీ కొంతమంది పెళ్లి చేసుకుందాం అని అడుగుతారు కానీ అవన్నీ అపద్దాలే డబ్బు కోసమో మరో రకంగా మోసం చేయడమే తప్ప నా పిల్లల బాధ్యత అయితే తీసుకోరు అందుకే పెళ్లి ఆలోచన లేదు అంటూ చెప్పింది గీత సింగ్.































