Featured

Geethakrishna : పిల్లల్ని కనడంలేదని చిరంజీవి, సురేఖ అడిగితే తప్పా… వాడెవడో దగ్గరికి వెళ్లి పబ్లిక్ లో అడుగుతావా? : గీతాకృష్ణ

Published

on

Geethakrishna : ప్రతిసారి ఏదో ఒక వైరల్ టాపిక్ గురించి తనదైన శైలిలో మాట్లాడుతూ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్న డైరెక్టర్ గీతా కృష్ణ ఇపుడు మెగా ఫ్యామిలీ మీద కామెంట్స్ చేసారు. ఇటీవల మెగా కొడుకు ఉపాసన కామినేని సద్గురు జగ్గీ వాసుదేవ ను కలవడం, అక్కడ పిల్లల ప్రస్తావన ఈ విషయాలన్నీ తెలిసినవే అయితే వాటిపై గీతా కృష్ణ స్పందించారు.

వాడితో ముందు పిల్లల విషయం అడగాలా…

ఉపాసన కామినేని, రామ్ చరణ్ లకు పెళ్ళై దాదాపు 10 సంవత్సరాలు పూర్తయ్యాయి. ఇప్పటికీ చాలాసార్లు వారి దగ్గర పిల్లలు గురించి ప్రస్తావన వచ్చేది. అది వ్యక్తిగత విషయమే అయినా చిరు అభిమానులకు మెగా వారసుడిని చూడాలనే కోరిక ఉంటుంది కనుక పలు ఇంటర్వ్యూల్లో, అటు ఉపాసన కు ఇటు రామ్ చరణ్ కు ఈ ప్రశ్న చాలా సందర్భాల్లో ఎదురయ్యేది. కానీ ఇటీవల ఉపాసన సద్గురు జగ్గీ వాసుదేవ గారితో జరిగిన చర్చలో పాల్గొని అందరి ముందు పిల్లల గురించి ప్రశ్న అడిగారు. పిల్లల్ని గురించిన ప్రశ్నలు వస్తున్నాయని ఆయనతో చెప్పగా ఆయన కనకుండా ఉంటే మంచిది అన్న ఉద్దేశంలో చెప్పారు. ఇక టాపిక్ మీద గీతా కృష్ణ తనదైన శైలిలో మాట్లాడారు.

Advertisement

పేదవారైనా, గొప్పవారైనా వాళ్ళింట్లో వంశాంకురాలు ఉండాలని భావించడం తప్పు కాదు కదా. ఎవరైనా పిల్లలకు పెళ్లి చేసాక వారి వారసుల కోసం ఎదురుచూస్తారు అది మామూలు విషయం. ఇక మెగాస్టార్ అయినా, ఆయన భార్య సురేఖ అయినా అంతే. ఈ విషయాన్ని తీసుకెళ్లి సద్గురు వద్ద పెట్టాలా, నాలుగు గోడల మధ్య చర్చించుకోవాల్సిన విషయాన్ని నలుగురిలో పెట్టుకోవడం ఏంటి, అతను ఎవరు పిల్లలను కానొద్దు అని చెప్పడానికి, ఉపాసన తన ఇంటి పరువును తీసుకెళ్లి పబ్లిక్ లో పెట్టింది. పిల్లలు వారి వ్యక్తిగత విషయం, పిల్లల్ని ఎపుడు కంటారు అని వాళ్ళ ఇంట్లోవాళ్ళు అడగడం తప్పు కాదు కానీ ఒత్తిడి మాత్రం చేయకూడదు. వారికి ఉన్న సమస్యలేమిటి అన్నది చర్చించకూడదు అంటూ వివరించాడు గీతా కృష్ణ.

Trending

Exit mobile version