టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా వెలుగొంది బాలీవుడ్ లో సెటిల్ అయినా హీరోయిన్ జెనీలియా.. బాలీవుడ్ హీరో రితేష్ దేశముఖ్ ని ప్రేమించి పెళ్లి చేసుకున్న జెనీలియా ఒకప్పుడు టాలీవుడ్ స్టార్ హీరోయిన్.. సత్యం సినిమా తో టాలీవుడ్ కి పరిచయమైనా జెనీలియా తోసినిమా తోనే అందరిని ఆకట్టుకుంది. ఆ తర్వాత వెంటనే పెద్ద సినిమాలు రావడంతో జెనీలియా కి తక్కువ సమయంలోనే స్టార్ డమ్ వచ్చింది. మూడో సినిమానే రాజమౌళి సై సినిమా లో చేసి హ్యాట్రిక్ హిట్ కొట్టి మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా ఉంది.

ఆ తర్వాత ఆమె వెనుతిరిగి చూసుకులేదు.. తన కెరీర్ లో బొమ్మరిల్లు సినిమా మైలురాయిగా నిలిచిపోతుంది. ఆ సినిమాలోని పాత్ర పేరుతో నే ఆమెను ఇంకా టాలీవుడ్ జనాలు పిలుస్తున్నారంటే ఆ సినిమా ఆమెకు ఎంత క్రేజ్ తెచ్చిపెట్టిందో చెప్పొచ్చు. ఇక టాలీవుడ్ లో వచ్చిన క్రేజ్ తో ఆమెకు బాలీవుడ్, కోలీవుడ్ ఛాన్స్ లు కూడా పెరిగిపోయాయి. బాలీవుడ్ లో ఓ సినిమా ద్వారా పరిచయమైనా రితేష్ దేశ్ ముఖ్ ని పెళ్లి చేసుకున్నాక ఆమె సినిమాలకు పూర్తిగా దూరమైంది… రీ ఎంట్రీ కోసం ఆమె అభిమానులు ఎదురుచూస్తుండగా తాజాగా ఆమెకు చేతికి అయినా గాయాన్ని అభిమానులతో ఓ ఫోటో ద్వారా పంచుకుంది.
సోషల్ మీడియా లో యాక్టివ్ గ ఉంటూ వస్తున్న ఈమె..తాజాగా తన చేతికి గాయం అయినట్లు తెలిపింది. తాజాగా ఆమె అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా తన ఫెయిల్యూర్స్ చూపించాలని రెడీ అయింది. జెన్నీ స్కేటింగ్ నేర్చుకునేటప్పుడు తనకు కలిగిన గాయం గురించి ఇంస్టాలో ఓ వీడియో పోస్ట్ చేసింది. ఆ వీడియోతో పాటు ఇలా రాసుకొచ్చింది. నా రికవరీ పావ్రీ స్టోరీ. కొన్నివారాల క్రితం నేను స్కేటింగ్ నేర్చుకోవాలని నిర్ణయించుకున్నాను. ఎందుకంటే నేను నా పిల్లలకు స్ఫూర్తిదాయకంగా ఉండాలని అనుకుంటున్నాను. అలాగే ఇంస్టాలో కూడా ఓ మంచి వీడియో పోస్ట్ చేయాలనీ భావించాను. అని పోస్ట్ లో వెల్లడించింది.



























