Getup Seenu : జబర్దస్త్ వల్ల మంచి గుర్తింపు తెచ్చుకుని ప్రస్తుతం కమెడియన్స్ గా మంచి పేరు తెచ్చికుంటున్నవారిలో గెటప్ శీను ఒకడు. తాను ఏ పాత్రలో అయినా పరకాయ ప్రవేశం చేసేస్తాడు. అందుకే అందరూ అతనికి బుల్లితెర కమలహాసన్ అంటూ బిరుదు కూడా ఇచ్చేసారు. ఇక శీను కి సినిమా అవకాదాలు బాగా వచ్చాయి. ఈ మధ్య చాలా సినిమాల్లో మంచి పాత్రలలో శీను కనిపిస్తున్నాడు. దీంతో జబర్దస్త్ లో కనిపించలేదు. ఇక సుధీర్, ఆది, అభి వంటి వారు వెళ్లిపోయారు కాబట్టి శీను కూడా వారి లాగే వెళ్లిపోయాడేమో అని అందరూ భావించినా శీను మళ్ళీ జబర్దస్త్ కి రీ ఎంట్రీ ఇచ్చి అందరిని సర్ ప్రైజ్ చేసాడు.

యముడి వేషంలో అలరించిన శీను…
ఇక జబర్దస్త్ కి మళ్ళీ వచ్చిన శీను రెండు టీముల్లో ఆదరగొడుతూ మళ్ళీ గెస్ట్ గా ఇతర టీమ్స్ లో కూడా చేస్తున్నాడు. మొత్తానికి శీను మళ్ళీ జబర్దస్త్ కి రావడంతో షోకి మంచి జోష్ వచ్చింది. ఈ వారం ప్రోమోలో శీను యముడి వేషంలో అలరించాడు. కైకాల సత్యనారాయణ గారి లాగా నటించడానికి ప్రయత్నించాడు. ఇక స్కిట్స్ లో ప్రేమించుకుంటున్న జంటలు నరకం లోకి వస్తే వాళ్ళు ఎందుకు చనిపోయారో రామ్ ప్రసాద్ చిత్ర గుప్తుడి గా శీను కి చెప్తాడు. మొదట రాకేష్, సుజాత చూపించి వీళ్ళు ఎందుకు చనిపోయారు అని అడిగితే వీళ్ళు ప్రేమించుకున్నారు అయితే పెద్దలు వీళ్ళ పెళ్ళికి ఒప్పుకున్నారు అందుకే చనిపోయారు అని చెబుతాడు. యముడు షాక్ అయి చూస్తుంటే పెద్దలు ఒప్పుకోరు అని ప్రేమించుకున్నారు కానీ ఒప్పుకునే సారికి ఇలా చనిపోయారని చెబుతాడు.

ఇక వర్ష ఇమ్మానుయేల్ కు లవ్ సాంగ్ వేయడం, ఆతరువాత వర్ష.. ఇమ్మూ నువ్వు నా ప్రేమను ఒప్పుకోకపోతే నా ఊపిరి ఆగిపోతుంది అంటూ అనగానే శీను బూతులను బయటికి వినిపించకుండా నోట్లోనే అనేస్తాడు, ఇక వీళ్ళ తరువాత ఫైమా, ప్రవీణ్ రాగానే లవ్ సాంగ్ రాగానే స్టేజి దిగి వచ్చి కెమెరా మెన్ వద్దకు వచ్చి ఇలాంటివి అవసరమా.. ఏవేవో పాటలు వేసి వాళ్ళ మధ్య ఏదేదో క్రియేట చేస్తారు… మిమ్మల్ని ఎవ్వరూ బాగుచేయలేరు అంటూ అక్కడి నుండి వెళ్ళిపోతాడు అక్కడితో ప్రోమో ఎండ్ అవుతుంది. ఇక దీనిపై నేటిజెన్స్ పలు రకాలుగా స్పందిస్తున్నారు. బయట పబ్లిక్ ఫీల్ అవుతున్న ఫ్రస్ట్రేషన్ ను శీను చూపించాడు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

































