Getup Seenu : జబర్దస్త్ నుండి ఫేమస్ అయిన కమెడియన్స్ లో గెటప్ శీను ఒకడు. బుల్లితెర కమల్ హాసన్ అని పిలవబడే గెటప్ శీను కామెడీతో పాటు యాక్టింగ్ కూడా ఇరగదీస్తాడని పేరుంది. ఇక జబర్దస్త్ నుండి బాగా పేరు తెచ్చుకున్న గెటప్ శీను సినిమాల్లోను కమెడియన్ గా మంచి అవకశాలను అందుకుంటున్నాడు. మధ్యలో కొంతకాలం జబర్దస్త్ కు బ్రేక్ ఇచ్చిన గెటప్ శీను మళ్ళీ రీ ఎంట్రీ ఇచ్చి కొనసాగుతున్నారు. మరో వైపు పెద్ధ హీరోల సినిమాలలో చేస్తూ హీరోగా కూడా కొన్ని సినిమాలను చేస్తున్నా ఇటీవలే ఒక సినిమా కోసం లిప్ లాక్ చేసి మరీ వైరల్ అయిన శీను, కిర్రాక్ ఆర్పీ నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు షాప్ ఓపెనింగ్ కి వచ్చాడు.

అందరూ వచ్చిన సుధీర్ రాకపోడానికి కారణం అదే…
నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు షాప్ తో మరోసారి వైరల్ అయిన ఆర్పీ ఆ షాప్ సెకండ్ బ్రాంచ్ ను మణికొండలో ఓపెన్ చేసాడు. ఇక జబర్దస్త్ కమెడియన్స్ చాలా మంది కర్రీ పాయింట్ ఓపెనింగ్ కి రావడం విశేషం. ఇక అందరూ వచ్చినా బుల్లితెరా పవర్ స్టార్ గా పిలవబడే సుడిగాలి సుధీర్ లేకపోవడంతో వచ్చిన జబర్దస్త్ కమెడియన్స్ ను ఆ విషయం అడిగేసారు మీడియా వాళ్ళు.

ఇక శీను, సుధీర్, రామ్ ప్రసాద్ మొదటి నుండి ఇప్పటి వరకు మంచి స్నేహితులు. దీంతో శీను ని ఇదే విషయం గురించి యూట్యూబ్ ఛానెల్ వాళ్ళు అడుగగా సుధీర్ చాలా బిజీగా ఉన్నాడంటూ చెప్పాడు శీను. కొత్త సినిమా చేస్తున్నాడని, ఆ సినిమా ప్రేపరషన్ లో బిజీగా ఉన్నాడని అందుకే నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓపెనింగ్ కి రాలేదని చెప్పాడు. మొత్తానికి సుధీర్ మరో సినిమాతో అభిమానులను అలరించడానికి సిద్ధమవుతున్నాడన్నమాట.
































