కొన్ని కొన్ని ఫోటోలను, చిత్రాలను చూసినప్పుడు ఎంతో విచిత్రంగా కనిపిస్తాయి.కొన్నిసార్లు అటువంటి ఫోటోలను చూసినప్పుడు మన కళ్ళు మనల్ని మోసం చేస్తున్నాయా అనిపించే విధంగా ఉంటాయి. ఇటువంటి ఫోటోలలో దాగిఉన్న నిజం తెలుసుకోవాలంటే కొద్దిగా మన మెదడుకు పదును పెట్టాలి. అప్పుడుగాని ఆ ఫోటోలో దాగి ఉన్న మర్మం ఏమిటో తెలియదు.ప్రస్తుతం ఇలాంటి ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

సోషల్ మీడియా వేదికగా ఓ మహిళ తన కూతురు పార్కులో ఆడుకుంటున్నటువంటి ఒక ఫోటోను షేర్ చేసింది. ఈ ఫోటోలో చిన్నారి సగం మాత్రమే కనిపించి మిగతా సగ భాగం భూమిలో కూరుకుపోతున్నట్లు కనిపిస్తుంది. అయితే ఈ చిన్నారి నిజంగానే భూమిలో కూరుకుపోతున్నట్టుగా ఉన్న ఈ చిత్రం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఎంతోమంది వారి మెదడు పదును పెడుతున్నారు.
ఈ ఫోటో చూసిన కొందరు నెటిజన్లు ఫోటోషాప్ ద్వారా ఈ ఫోటోని ఇలా క్రియేట్ చేసారని చెప్పగా, మరికొందరు ఆ చిన్నారి గోడ పక్కన నిలబడి ఉందని కామెంట్ చేస్తున్నారు. మరి ఇందులో ఏది నిజమో ఆ చిన్నారి సగం మాత్రమే మనకు ఎలా కనబడుతుందో మీరు కూడా మీ మెదడుకు పదును పెట్టి సరైన సమాధానాన్ని ఆలోచించి సరైన సమాధానాన్ని కామెంట్ చేయండి.































