Glamour show @ social media : అంతర్జాలం.. ఇది ఎన్ని విధాలుగా మన జీవితంలో ఉపయోగపడుతుందో అంతే అనర్థాలను తెస్తుంది. కాలక్షేపానికి అంటూ చూస్తున్న ఇంస్టాగ్రామ్ రీల్స్, యూట్యూబ్ రీల్స్ ను ఇపుడు పనులు మానేసి పక్కన వాళ్ళతో సంబంధం లేదు అన్నట్లుగా చూస్తున్నారు. ముఖ్యంగా యువత సోషల్ మీడియా వల్ల బాగా ప్రభావితం అవుతున్నారు. ఇక అమ్మాయిలైతే హీరోయిన్లకు మేమేమీ తీసిపోము అంటూ గ్లామర్ షో ఇస్తూ కాష్ చేసుకుంటున్నారు.

అశ్లీలతకు కేర్ ఆఫ్ గా సోషల్ మీడియా…
సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్.. ఈ పేరుతో సోషల్ మీడియాలో ఏదైనా చేయొచ్చు. నిజానికి మనకు ఉన్న విభిన్నమైన టాలెంట్ ను ప్రపంచానికి చూపడానికి సోషల్ మీడియా బాగా పనికి వస్తుంది. అయితే ఎలాగైనా డబ్బు పేరు సంపాదించాలి అనుకునేవాళ్ళు కూడా సోషల్ మీడియా ద్వారా బాగా ఫేమస్ అవుతున్నారు. సమాజానికి ఉపయోగపడే వీడియోలు చేస్తూ గుర్తింపు తెచ్చుకునే వారు కొంతమంది అయితే యువతను పెడదోవ పట్టించే వీడియోలతో రెచ్చిపోతున్న వాళ్లు చాలా మంది ఉన్నారు. టిక్ టాక్ తో మొదలైన ఈ జాడ్యం ఇపుడు ఇంస్టాగ్రామ్ పుణ్యమా అని మరింత విస్తరిస్తోంది. ముఖ్యంగా అమ్మాయిలు హద్దులు మీరి ఎక్సపోసింగ్ ఇస్తూ డాన్స్ లు చేస్తూ వీడియోలను చేసి ఫేమస్ అవుతున్నారు.

దీనికి ఈ రాష్ట్రం ఆ రాష్ట్రం అని సంబంధం లేకుండా అమ్మాయిలు చాలా మంది ఇంస్టాగ్రామ్ స్టోరీస్ లో గ్లామర్ షో చేస్తూ కాష్ చేసుకుంటున్నారు. ఇలాంటి వీడియోల వల్ల అత్యాచార నేరాలు ఎక్కువవుతున్నాయి. ఎలాంటి ఫీల్టర్స్ కానీ నిబంధనలు కానీ లేకపోవడం వల్ల చిన్నపిల్లలు సైతం ఈ వీడియాలను చూసేస్తున్నారు. హీరోయిన్ల కన్నా మేమేమి తక్కువ కాదు అంటూ అసలు మొహమాటం పడకుండా అందాలను ఆరబోస్తూ చూపు తిప్పుకొనివ్వడం లేదు. డబ్బు సంపాదన కోసం కొందరు అమ్మాయిలు ఈ మార్గన్ని ఎంచుకుంటే మరి కొంతమంది తల్లిదండ్రుల ప్రోత్సాహంతోనే ఇలాంటి వీడియోలను చేస్తూ సమాజన్ని నాశనం చేసేస్తున్నారు. ఈ నయా పోకడ ఎక్కడి దాకా వెళుతుందో చూడాలి.































