God Father : ఆకలితో ఉన్న వ్యక్తి కి బిర్యానీ దొరికినట్లు ఆచార్య తో నిరాశలో ఉన్న మెగా అభిమానులకు ‘గాడ్ ఫాదర్’ బిర్యానీల దొరికిందని చెప్పొచ్చు. మెగాస్టార్ ని మాస్ హీరోగా ఎలివేట్ చేసి డైరెక్టర్ సక్సెస్ అయినట్లే. చిరు తో పాటు బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ తెలుగులో ఈ సినిమాతో ఎంట్రీ ఇచ్చారు. ఇక లూసిఫర్ సినిమా తెలుగులో కూడా డబ్ అవడం వల్ల ఆల్రెడీ సినిమా కథ ఏంటి అనేది అందరికీ తెలుసు అయితే సినిమాలో చిరు ని ఎలా చూపించాడు, మన తెలుగు నేటివిటీ కి తగ్గట్టు కథను డైరెక్టర్ మలిచాడా, ప్రేక్షకులకు నచ్చిందా అన్నదే పాయింట్. ఈ విషయంలో డైరెక్టర్ సక్సెస్ అయ్యాడు. మెగాఫ్యాన్స్ కి సినిమా పండగ అనే చెప్పాలి.

గాడ్ ఫాదర్ తో రీ ఎంట్రీ ఇచ్చిన సర్వదామన్ బెనర్జీ గుర్తుపట్టారా…
గాడ్ ఫాదర్ సినిమా మోహన్ లాల్ నటించిన మలయాళం సినిమా లూసిఫర్ రీమేక్ గా తెరకెక్కిన ఈ సినిమా దసరా కనుకగా అక్టోబర్ 5 న విడుదల అయింది. చిరంజీవి, సల్మాన్ ఖాన్, నయన తార, మురళి శర్మ, సత్యదేవ్ వంటి వారు నటించిన ఈ సినిమాలో ఒక సీనియర్ నటుడు దాదాపు 35 ఏళ్ల తరువాత మళ్ళీ కనిపించారు. ఆయన ఎవరో కాదు ఎవర్ గ్రీన్ క్లాసిక్ సినిమా ‘సిరివెన్నెల’ సినిమా హీరో సర్వదామన్ బెనర్జీ.

తెలుగు వ్యక్తి కాకపోయినా ఆ సినిమాలో అంధుడి పాత్రలో ఒదిగిపోయి నటించిన ఆయన ఆ తరువాత చిరంజీవి ‘స్వయం కృషి’ సినిమాలో ఆయనతో కలిసి నటించారు. ఇక మళ్ళీ అడపాదడపా కొన్ని సినిమాలు చేసినా అవి పెద్దగా ఎవరికీ గుర్తుకు లేవు కానీ సిరివెన్నల సినిమా మాత్రం ఇప్పటికీ అందరికీ గుర్తుంది. ఇక ఆయన సినిమాలను పక్కనబెట్టి ఆధ్యాత్మికత వైపు వెళ్లిపోయారు. మళ్ళీ ఇన్నేళ్లకు అదికూడా చిరు సినిమాలోనే రీ ఎంట్రీ ఇచ్చారు బెనర్జీ. గాడ్ ఫాదర్ లో చిరంజీవి, నయనతార లకు తండ్రిగా నటించారు. చాలా మంది ఆయనను గుర్తు పట్టాలేదు అంతలా ఆయన మారిపోయారు కానీ నిషితంగా పరిశీలిస్తే కనుక్కోవచ్చు.































