బంగారం కొనుగోలుదారులకు శుభవార్త. గత మూడు రోజులుగా పెరుగుతూ వచ్చిన పసిడి ధరలు తాజాగా దిగి వచ్చాయి. దేశవ్యాప్తంగా బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. గత 10 రోజులుగా బంగారం ధరలు 3 రోజుల పాటు తగ్గగా.. 4 రోజులు పెరిగాయి. 3 రోజులు పాటు స్థిరంగా ఉన్నాయి. 10 రోజుల్లో పసిడి 10 గ్రాములు ధర రూ.540 వరకు తగ్గింది. 10 గ్రాముల బంగారం ధర రూ.44,010గా ఉంది. దేశంలోని వివిధ ప్రధాన నగరాలలో బంగారు ధరలను ఓ సారి చూస్తే…

ఢిల్లీ: 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,160 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,360 ఉంది.
చెన్నై: 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,480 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,530 ఉంది.
ముంబై: 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,980 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,980 ఉంది.
బెంగళూరు: 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,500 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,200 ఉంది.
హైదరాబాద్: 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,000 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,090 ఉంది.
విజయవాడ: 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,010 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,010 ఉంది.






























