బంగారం కొనుగోలుదారులకు శుభవార్త. పసిడి రేటు భారీగా పడిపోయింది. గత కొద్దిరోజులుగా తగ్గుతూ. పెరుగుతూ ఉన్న పసిడి ధరల్లో ఇప్పుడు భారీ మార్పులే వచ్చాయి. ఈరోజు కూడా బంగారం రేటు నేలచూపులు చూసింది. బంగారం ప్రేమికులకు ఇది ఆనందాన్ని కలిగించే అంశమని చెప్పుకోవచ్చు. బంగారం ధర బాటలోనే వెండి రేటు కూడా నడిచింది. భారీగా తగ్గింది.

హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ధరలు ఇలా ఉన్నాయి. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.600 తగ్గి రూ.44,250కి చేరింది. అదే సమయంలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.410 తగ్గి రూ.48,270 కి చేరిది. దేశీయంగా మార్కెట్లు తిరిగి క్రమంగా పుంజుకోవడంతో బంగారం ధరలు తగ్గుముఖం పడుతున్నాయి. బంగారం ఇలా ఉంటే మరోవైపు వెండి ధరలు కూడా తగ్గాయి. కిలో వెండి ధర రూ.1,100 తగ్గి రూ.74,000 వద్ద ఉన్నది.



























