కరోనా నేపధ్యంలో పలు రైళ్ళు నిలిచిపోయిన విషయం తెలిసిందే.. అయితే తాజగా కాచిగూడ, విశాఖపట్నం, లింగంపల్లి స్టేషన్ల మధ్యలో పలు రైళ్ల రాకపోకలను పునరుద్ధరిస్తూ నిర్ణయం తీసుకుంది దక్షిణ మధ్య రైల్వే. సోమవారం తీసుకున్న ఈ నిర్ణయంతో ఈ నెల 15వ తేదీ నుంచి పలు రైళ్లు రాకపోకలు కొనసాగించనుంది రైల్వే శాఖ.

అదేవిధంగా విశాఖపట్నం, కడప, ధర్మవరం, శ్రీసత్యసాయి ప్రశాంతి నిలయం స్టేషన్ల మధ్యలో కూడా రైళ్ల రాకపోకలను పునః ప్రారంభించనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. దక్షిణ మధ్య రైల్వే పరిధిలో గతంలో నిలిచిపోయిన పలు ప్రత్యేక రైళ్లను ఈ నెల 17 నుంచి పునరుద్ధరించనున్నారు.



























