భారీగా పెరుగుతూ వచ్చిన బంగారం, వెండి ధరలు.. తాజాగా తగ్గుముఖం పట్టాయి. దేశీయంగా 10 గ్రాముల బంగారంపై రూ.1,120 వరకు తగ్గుముఖం పట్టగా, కిలో వెండి ధరపై రూ.11000 వరకు తగ్గింది. ఇక దేశీయంగా ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,150 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,340 ఉంది.

ఇక ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,230 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,230 వద్ద ఉంది. హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,000 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,000 ఉంది. విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,000 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,000 ఉంది.



























