తెలుగు చలన చిత్ర పరిశ్రమను బాహుబలి సినిమాతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చిన దర్శక ధీరుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చారిత్రత్మక చిత్రం “అర్ అర్ అర్”.. ఈ చిత్ర విశేషాలు ఎప్పటి కప్పుడు సోషల్ మీడియా లో హల్చల్ చేస్తూనే ఉంటాయి. రాజమౌళి ఏ చిత్రాన్నైనా ఎక్కువ సమయం తీసుకొని అయన అనుకున్న రీతిలో రూపొందిస్తారు అని అందరికీ తెలిసిన విషయమే.. ప్రభాస్ నటించిన బాహుబలి సినిమాను కూడా 2 సంవత్సరాలు సమయం తీసుకొని ఎంతో అద్భుతంగా తెరకెక్కించాడు.. బాహుబలి పై వచ్చిన అంచనాలు తెలుగు సినిమా ఇండస్ట్రీనీ తారా స్థాయిలో నిలబెట్టాయి.. ఇప్పుడు అదే తరహాలో 2 సంత్సరాల కంటే ఎక్కువ సమయం తీసుకొని మరి ఈ మల్టీస్టారర్ మూవీ నిర్మిస్తున్నారు జక్కన్న.. యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న ఈ చిత్రంలో ఎన్టీఆర్ కొమరం భీం, చరణ్ అల్లూరి సీత రామరాజు పాత్రలు పోషిస్తున్నారు…
అయితే ఈ సినిమా కోసం ప్రపంచవ్యాప్తంగా అటూ నందమూరి ఫ్యాన్స్, ఇటు మెగా ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదరుచూస్తున్నారు.. జక్కన తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో తారక్ కి ఎక్కువ ప్రాధాన్యత వున్నట్లు తెలుస్తుంది.. అందుకే తారక్ వేషధారణ కూడా బయటకు రాకుండా చిత్ర యూనిట్ ఎంతో జాగ్రత్త తీసుకుంటుంది.. తారక్ కి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం వలన మెగా ఫ్యాన్స్ చాలా ఫీల్ అవుతున్నారట. అందుకే జక్కన చరణ్ కి సంబందించిన ఇంకా కొన్ని యాక్షన్ సీన్స్ తయారు చేశారట.. అందులో భాగంగానే తారక్, చరణ్ ల మధ్య ఒక యాక్షన్ సీన్ రూపొందించారట రాజమౌళి. చరణ్ మరియు తారక్ మధ్య జరిగే ఫైట్ లో చరణ్ తారక్ నీ కొట్టే సీన్ అని తెలుస్తుంది. అంతే కాకుండా ఈ సీన్ షూటింగ్ చేయడానికి 10 రోజులు తీసుకున్నారట. ఈ విషయంపై మెగా అభిమానులు సంతోషం వ్యక్తం చేశారు.. ఇన్ని అంచనాలతో వస్తున్న ఈ ఆర్ ఆర్ ఆర్ చిత్రం 2021 జనవరి 8 న ప్రేక్షకుల ముందు కు రాబోతుంది..




























