కరోనా మహమ్మారి ఇండియాలో విజృంభిస్తున్న నేపథ్యంలో లాక్ డౌన్ వల్ల ఇండియాలోని ఇబ్బదుల్లో ఉన్న వలస కార్మికులను ఆదుకునేందుకు ముందుకు వచ్చారు గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్. గివ్ ఇండియా అనే స్వచ్చంద సంస్థకు రూ.5కోట్ల భారీ విరాళాన్ని ప్రకటించారు. దేశంలోని రోజువారీ కార్మికుల కుటుంబాలకు ఈ నగదు సహాయం అందించనున్నారు. ఈ సందర్భంగా గివ్ ఇండియా ట్విట్టర్ ద్వారా సుందర్ పిచాయ్ కు కృతఙ్ఞతలు చెప్పింది.

ఇదిలా ఉంటె మరో పక్క గూగుల్ సంస్థ కరోనా వైరస్ తో బాధపడుతున్న వారిని ఆదుకునేందుకు ప్రపంచవ్యాప్తంగా 100 ప్రభుత్వ సంస్థలకు 800 ల మిలియన్ డాలర్లను సాయంగా ప్రకటించింది. మరోవైపు స్వచ్చంద సంస్థలు, బ్యాంకులకు 200 మిలియన్ డాలర్లు పెట్టుబడులను ప్రకటించింది.
Thank you @sundarpichai for matching @Googleorg ‘s ₹5 crore grant to provide desperately needed cash assistance for vulnerable daily wage worker families. Please join our #COVID19 campaign: https://t.co/T9bDf1MXiv @atulsatija
— GiveIndia (@GiveIndia) April 13, 2020




























