తెలంగాణ ప్రజలకు 75వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ శుభాకాంక్షలు తెలిపారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ పేరుతో జరుపుకుంటున్న 75వ స్వాతంత్య్ర దినోత్సవం మనదేశ చరిత్రలో గొప్పదినమని అన్నారు. ఎందరో అమరవీరుల త్యాగాల ఫలితంగా స్వాతంత్రం సిద్ధించిందని ఆమె పేర్కొన్నారు.

కాగా దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించిందని గవర్నర్ తెలిపారు. దేశం కోసం ప్రాణాలర్పించిన ప్రతి ఒక్క వీరుడికి నివాళులర్పిస్తున్నా నని గవర్నర్ అన్నారు

































