Gudem Mahipal Reddy son death : తెలంగాణ రాష్ట్ర బిఆర్ఎస్ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి పెద్ద కుమారుడు విష్ణు వర్ధన్ రెడ్డి గుండె పోటుతో మృతి చెందారు. ఆయన గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతుండగా తాజాగా కంటినెంటల్ హాస్పిటల్ లో చికిత్స పొందుతు గురువారం తెల్లవారుజామున 2 గంటల సమయంలో గుండె పోటుతో మృతి చెందారు. ఆయన అంతిమ యాత్రకు వేల మంది జనాలు హాజరై వీడ్కోలు పలకాగా ఆయనను చివరిసారిగా చూసి ఆయన భార్య వెక్కి వెక్కి ఏడుస్తుండటం అందరిని కంటతడి పెట్టించింది.

సోమ్మసిల్లిన ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి….
గూడెం మహిపాల్ రెడ్డి ఎమ్మెల్యే అయ్యాక ఆ నియోజవర్గం పనులను రాజకీయాలలోనూ కొడుకు విష్ణువర్ధన్ రెడ్డి చూసుకుంటూ చురుగ్గా ఉన్నారు. మహిపాల్ రెడ్డి గారికి విష్ణు వర్ధన్ రెడ్డి,విక్రమ్ రెడ్డి ఇద్దరు కుమారులు కాగా విష్ణు వర్ధన్ రెడ్డి ముప్పై సంవత్సరాలు కాగా ఆయన కిడ్నీలు ఫెయిల్ అయి కాంటినెంటల్ హాస్పిటల్ లో చికిత్స పొందుతు కామెర్లు రావడంతో పరిస్థితి విషమించగా తెల్లవారుజామున గుండె పోటుతో మృతి చెందారు.

ఆయనకు ఒక కూతురు, కుమారుడు కాగా ఆయన అంత్యక్రియల సమయంలో వేలాది మంది తరలి రాగ భార్య కిరణ్మయి ఆయనను కడసారి చూసుకుని బోరున విలపించింది. ఇక ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి కొడుకుకి అంత్యక్రియలు జరుపుతూ సోమ్మసిల్లిపోయారు.