Gully Boys Fame Riyaaz : ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా కొత్త టాలెంట్లు ప్రపంచానికి పరిచయం అవుతూనే వున్నాయి. ఇలా సోషల్ మీడియాలో వారి టాలెంట్ ను బయట పెడుతూ సెలబ్రిటీలుగా మారుతున్నారు. ఈకోవాలోకి చెందినవారిలో గల్లీ బాయ్స్ ఫేమ్ రియాజ్ కూడా ఒకరు. రియాజ్ యూట్యూబ్ లో వీడియోలు చేస్తూ ఫేమ్ అయ్యాడు. యూట్యూబ్ లో వచ్చిన పేరుతో సద్దాంతో బుల్లితెర మీద కామెడీ షోలు చేశారు.

ప్రస్తుతం మా కామెడీ స్టార్స్ లో మంచి పేరు సంపాదించుకున్నాడు. అంతేకాకుండా సినిమాలలో కూడా అవకాశాలు సొంతం చేసుకున్నాడు. రియాజ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వీరాభిమాని అన్న సంగతి తెలిసిందే. అంతేకాదు జనసేన పార్టీ తరపున పోటీ చేయడం కూడా జరిగింది. అయితే తాజాగా రియాజ్ కి సంబంధించిన ఒక వార్త వైరల్ అవుతోంది.
వైరల్ అవుతున్న రియాజ్ పెళ్లి ఫోటో……
రియాజ్ పెళ్లికి సంబంధించి ఈ ఏడాది ఫివ్రబరిలోనే వార్తలు వచ్చాయి. రియాజ్ పెళ్లి నజీరా అనే అమ్మాయితో ఘనంగా జరిగింది. అప్పుడు రియాజ్ పెళ్లి ఫోటోలు నెట్ లో వైరలయ్యాయి. అపుడు అషు రెడ్డి వీరి పెళ్లి ఫోటోను తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్ ద్వారా అభిమానులతో పంచుకొని శుభాకాంక్షలు తెలియజేసింది. ఇలా మిమ్మల్ని చూడటం నాకు చాలా సంతోషంగా ఉంది హ్యాపీ మ్యారీడ్ లైఫ్ రియాజ్ అండ్ నజీరా అంటూ… వీరి పెళ్లి ఫోటో షేర్ చేయడం తో అపుడు వైరల్ అయ్యింది. అయితే ఇపుడు మరోసారి ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.


































