Gummadi Sharada : అప్పటి సినిమా హీరోలకు తండ్రి పాత్రలో ఎక్కువగా కనిపించి ఆయన కన్నా పెద్ద హీరోలకు తండ్రి గా నటించి పేరు తెచ్చికున్న నటుడు గుమ్మడి వెంకటేశ్వరరావు గారు. గుంటూరు జిల్లాకు చెందిన ఆయన చదువుకునే సమయంలోనే నాటకాల మీద మక్కువతో నాటకాలు వేసేవారు. ఆ తరువాత సినిమాల్లో నటించడానికి మద్రాస్ వెళ్లి అవకాశాల కోసం ప్రయత్నంచారు. ఇక మొదట్లో అంతగా అవకాశాలు రాకపోయినా ఆ తరువాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎక్కువ సినిమాల్లో అవకాశాలు వచ్చాయి. సుమారు 500 లకు పైగా సినిమాల్లో నటించిన ఆయన గురించిన వివరాలను ఆయన కూతురు గుమ్మడి శారద గారు వివరించారు.

అగ్ర నటుల మధ్య గొడవలు… సావిత్రి గారి జీవితం…
గుమ్మడి గారికి ఎన్టీఆర్ గారికి 1950 నుండి పరిచయం ఉండగా ఏఎన్ఆర్ గారికి గుమ్మడి గారికి 1956 నుండి పరిచయం ఉందంటూ అయితే అవకాశాలు తగ్గిన సమయంలో సినిమా వదిలి వెళ్లాలని అనుకున్న గుమ్మడి గారు ఎన్టీఆర్ గారి వల్ల అలానే ఉండి మళ్ళీ అవకాశాలను అందుకుని ఎన్నో సినిమాలలో నటించారని ఆయన కూతురు శారద తెలిపారు. ఇక ఇద్దరు అగ్ర నటులైన ఎన్టీఆర్ ఏఎన్ఆర్ ల మధ్య విబేధాలు ఉండేవని అయితే వారిద్దరి క్యాంపుల్లోనూ నాన్నగారు పనిచేసారంటూ చెప్పారు శారద.

ఆధిపత్యమే తప్ప వేరే మస్పర్తలు ఎన్టీఆర్, ఏఎన్ఆర్ మధ్య లేవని చెప్పారు. సావిత్రి గారి ఇంటికి జమున భానుమతి ఇలా అందరి ఇంటికి వెళ్ళేవాళ్లమని చెప్పారు. సావిత్రి గారు చాలా అభిమానం గల మనిషి, తను ఎంతో బాగా బతికి చివరి రోజుల్లో ఇబ్బందులు పడినా ఎవరి వద్ద సహాయం తీసుకోక పోవడానికి కారణం ఆమె ఆత్మభిమానమే అంటూ తెలిపారు శారద. గుమ్మడి గారితో మంచి అనుబంధం ఉండేదని ఇక ఆయన వద్ద ఎపుడో తీసుకున్న డబ్బును కూడా అడగకపోయినా వెనక్కి ఇచ్చేసారు అంటూ ఆమె చాలా ఆత్మభిమానం గల వ్యక్తి అంటూ తెలిపారు.



























