గుట్కా మాఫియా.. జర్నలిస్టును అత్యంత కిరాకతంగా హాతమార్చింది. కర్నూల్ జిల్లా నంద్యాలలో ఈ సంఘటన చోటుచేసుకుంది.జర్నలిస్ట్ కేశవను కత్తులతో దాడి చేసి దారుణంగా హత్య చేశారు. గుట్కా ముఠా సాగిస్తున్న అక్రమాలను వెలికితీసి.. రుజువులతో సహా టీవీలో ప్రసారం చేయించాడు. దీంతో అతనిపై పగ పెంచుకున్న ఆ ముఠా అతడి ప్రాణాల తీసింది.

కేశవ ఓ యూట్యూబ్ ఛానల్‌లో రిపోర్టర్‌గా పనిచేస్తున్నాడు. ఈ హత్యను గుట్కా ముఠాతో సంబంధం ఉన్న ఇటివలే సస్పెండ్ అయిన ఓ కానిస్టేబుల్ చేయించి ఉంటాడని కేశవ కుటుంబ సభ్యులు, బంధువులు ఆరోపిస్తున్నారు. సంఘటన స్థలాన్ని ఎస్పీ సుధీర్ కుమార్ రెడ్డి పరిశీలించారు. నిందితుల ప్రత్యేక టీంలతో కలిసి గాలిస్తున్నట్లుగా తెలిపారు.































