GV Narayana : ‘అంతులేని కథ’ సినిమాతో నటుడుగా పరిచయమైన నారాయణ గారు ఆయన తండ్రి బాటలో నవయుగ డిస్ట్రిబ్యూషన్ లో ఉండకుండా నటన వైపు అడుగులేసారు. మద్రాస్ లోని ఫిల్మ్ ఇస్టిట్యూట్ లో చేరి శిక్షణ తీసుకున్న నారాయణ గారు సినిమా విశేషాలను అలాగే వాళ్ళ ఇన్స్టిట్యూట్ నుండి వచ్చిన స్టూడెంట్స్ ఆ తరువాత సినిమా రంగంలో ఎంత స్థాయి కి ఏదిగారు అన్న విషయాలతో పాటు నవయుగ తో అక్కినేని నాగేశ్వరావు గారికి ఉన్న అనుబంధం గురించి వివరించారు.

నాగేశ్వరావు గారి ఆ విషయంలో కోపం వచ్చింది…
నవయుగ డిస్ట్రిబ్యూషన్ అలాగే అన్నపూర్ణ పిక్చర్స్ కలిసి ఎన్నో సినిమాలకు పనిచేసారు. అలా నారాయణ రావు గారి నాన్న గారికి నాగేశ్వరావు గారికి ఎంతో మంచి అనుబంధం ఉంది. దేవదాసు సినిమా వల్ల ఇద్దరి మధ్యా కొంత అభిప్రాయ బేధాలు వచ్చాయి. నాగేశ్వరావు గారు చేసిన దేవదాసు సినిమాను నవయుగ వారే నిర్మించాయు. మళ్ళీ ఆ సినిమాను కృష్ణ గారు తీసినపుడు నవయుగ వాళ్ళే పనిచేడంతో నాగేశ్వరావు గారికి కోపం వచ్చింది. క్లాసిక్ సినిమాను మళ్ళీ ఎందుకు తీశారు ఎంతో అనుబంధం ఉన్న మీరే ఎలా చేసారు అని అడిగారు. హైదరాబాద్ లోని సారథి స్టూడియో అప్పటికే నారాయణ రావు గారి తండ్రి గారు తీసేసుకోవడం, కార్మికుల బంద్ నడుస్తున్న సమయంలో నాగేశ్వరావు గారు స్టూడియో ఓపెన్ చేయమని అడిగితే కాదన్నారు. దీంతో నాగేశ్వరావు గారు కోపంతో అన్నపూర్ణ స్టూడియోస్ కట్టాలని నిర్ణయించుకున్నారు అంటూ అప్పటి సంఘటనలు చెప్పారు.

ఇక నటన వైపు ఆసక్తితో సినిమా ఇన్స్టిట్యూట్ లో చేరాలని పూణే వెళ్లాలని అనుకున్న నారాయణ రావు గారు మద్రాస్ లో ఫిల్మ్ ఛాంబర్ వాళ్లే ఇన్స్టిట్యూట్ పెట్టేసరికి అక్కడ జాయిన్ అయ్యారు. అందులో రజనీకాంత్ కన్నడ నుండి నారాయణ గారు తెలుగు నుండి ఇలా స్టూడెంట్స్ వెళ్లారు. ఇక అలా సినిమా అవకాశం వచ్చి ‘చిలకమ్మ చెప్పింది’ సినిమాను పాలకొల్లు లో షూటింగ్ చేస్తున్న సమయంలో నారాయణ రావు గారు రజనీకాంత్ వద్దకు చిరంజీవి షూటింగ్ చూడటానికి వచ్చి కలిసి అడుగగా ఇన్స్టిట్యూట్ లో చేరమని సలహా ఇచ్చారట అలా వాళ్ళ జూనియర్ గా చిరు ఇన్స్టిట్యూట్ లో చేరాడు.































