రాష్ట్రంలో ఎండల తీవ్రత బాగా పెరిగింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని స్కూల్స్ కు ఒక్కపూట బడులను ప్రకటించింది తెలంగాణ ప్రభుత్వం. ప్రభుత్వ మరియు ప్రైవేట్ పాఠశాలలకు ఈ ఒంటిపూత బడులు వర్తిస్తుంది. ఈమేరకు ఒక ప్రకటన విడుదల చేసారు పాఠశాల విద్యా కమిషనర్ చిత్రా రామచంద్రన్. ఈనెల 16 నుంచి ఒంటిపూట బదులు ప్రారంభం అవుతాయని తెలిపారు. ఈ క్రమంలో పాఠశాలలు ఉదయం 8 గంటల నుండి ప్రారంభమై మధ్యాహ్నం 12:30 గంటల వరకు పని చేస్తాయని తెలిపారు.

ఒంటిపూట బడుల సమయంలో మధ్యాహ్నం 12:30 గంటలకు మధ్యాహ్నం భోజనం అనతంరం విద్యార్థులను ఇంటికి పంపిస్తారు. వార్షిక పరీక్షల తరువాత ఏప్రిల్ 23వ తేదీనుంచి జూన్ 11 వరకు పాఠశాలలకు వేసవి సెలవులు ప్రకటించారు. పాఠశాలలు తిరిగి జూన్ 12వ తేదీన ప్రారంభమవుతాయని ప్రకటనలో తెలిపారు.




























