Connect with us

Featured

సూపర్ స్టార్ కృష్ణ కు హృదయపూర్వక జన్మదీన శుభాకాంక్షలు💐💐

Published

on

కృష్ణ 1942 మే 31 న గుంటూరు జిల్లా, తెనాలి మండలములో తెనాలి పట్టణానికి 4 కిలోమీటర్ల దూరంలోని బుర్రిపాలెం గ్రామస్తులైన ఘట్టమనేని వీరరాఘవయ్య చౌదరి, నాగరత్న దంపతుల పెద్ద కొడుకుగా జన్మించాడు.అతనిది రైతు కుటుంబం. తల్లిదండ్రులు పెట్టిన పేరు శివరామకృష్ణమూర్తి కాగా సినిమాల్లోకి వచ్చినప్పుడు ఆదుర్తి సుబ్బారావు ఈ పేరును కృష్ణగా కుదించాడు.

చిన్నతనం నుంచి అతనికి ఎన్.టి.రామారావు అభిమాన నటుడు, పాతాళ భైరవి అభిమాన చిత్రం.కృష్ణ తల్లిదండ్రులకు పెద్ద కొడుకు, అతనికి ముగ్గురు తోబుట్టువులు ఉన్నారు.అతని తల్లిదండ్రులకు కృష్ణను ఇంజనీరును చేయాలన్న కోరిక ఉండేది. అందుకోసం ఇంటర్మీడియట్‌లో ఎం.పి.సి. సీటు కోసం ప్రయత్నించి, గుంటూరు కళాశాలలో దొరకకపోవడంతో పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో ఎం.పి.సి. గ్రూపుతో ఇంటర్ చేరాడు. అక్కడ మూడు నెలలే చదివి, ఏలూరులోని సి.ఆర్.రెడ్డి కళాశాలకు మారాడు. అక్కడే ఇంటర్మీడియట్ పూర్తిచేసి తర్వాత బీఎస్సీ చదివాడు. సి.ఆర్.రెడ్డి కళాశాలలో కృష్ణ, తర్వాతి కాలంలో సినిమాల్లో నటునిగా ఎదిగిన మురళీమోహన్ క్లాస్‌మేట్లు, మంచి స్నేహితులు.కృష్ణ డిగ్రీ చదువుతూండగా ఏలూరులో ప్రఖ్యాత నటుడు అక్కినేని నాగేశ్వరరావుకు ఘనంగా పౌర సన్మానం జరిగింది. ఆ కార్యక్రమానికి హాజరైన కృష్ణకు నాగేశ్వరరావు నటుడు కావడం వల్లనే ఆ స్థాయిలో ప్రజాభిమానం పొందగలుగుతున్నాడని అర్థం చేసుకుని సినీ నటుడు కావాలన్న అభిలాష పెంపొందించుకున్నాడు.కృష్ణ వ్యక్తిగతంగా మంచి మనిషిగా, నిర్మాతల హీరోగా పేరుతెచ్చుకున్నాడు. క్లుప్తంగా, ముక్కుసూటిగా, నిజాయితీగా మాట్లాడేవాడు. తన సినిమా ఫ్లాప్ అయితే నిర్మొహమాటంగా ఆ సంగతి అంగీకరించేవాడు.

తన బలాలతో పాటు లోపాలపైనా, తనకున్న పరిమితులపైనా కూడా చక్కని అవగాహన ఉండేది.టాప్ స్టార్‌లుగా ఎన్టీఆర్, ఏఎన్నార్ ఉన్న దశలో వారిద్దరికీ ప్రత్యేకించి కొందరు నిర్మాతలు ఉండేవారు, వారితోనే ఎక్కువ సినిమాలు చేసేవారు. ఆ దశలో కృష్ణ కొత్త నిర్మాతలకు డేట్స్ ఇచ్చి సినిమాలు చేసి వారికి పరిశ్రమలోకి రావడానికి మార్గంగా ఉండేవాడు. తనతో సినిమా తీసి నిర్మాత ఆర్థికంగా నష్టపోయినప్పుడు తానే నిర్మాత వద్దకు వెళ్ళి వాళ్ళు దెబ్బతినకుండా ఉండేందుకు వెంటనే మంచి సినిమా ప్లాన్ చేయమని, అడ్వాన్స్ అక్కర్లేదని డేట్లు ఇచ్చేవాడు. విడుదలకు ముందు నిర్మాతలు ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటే తన పారితోషికం వదులుకునేవాడు. “హీరోగా అతను పైకి రావడానికి మంచితనం కూడా ఒక కారణం” అంటాడు సహనటుడు కైకాల సత్యనారాయణ.కొత్త జాన్రాలు, సాంకేతికాంశాలు ప్రవేశపెట్టడంతో పాటు రిస్క్ తీసుకుని దెబ్బలు తినైనా ఫైట్ సీన్లు పండించడం వల్ల కృష్ణను డాషింగ్ అండ్ డేరింగ్ హీరో అని పిలిచేవారు. ఈ క్రమంలో షూటింగుల్లో బైకు మీంచి, గుర్రాల మీంచి పడిపోవడం, ప్రమాదవశాత్తు కత్తిగాట్లు పడడం, ప్రతినాయక పాత్రధారిని పైకెత్తబోయి కింద పడడం వంటివెన్నో ఎదుర్కొన్నాడు.సిరిపురం మొనగాడు (1983) షూటింగ్ సమయంలో ఏకంగా ప్రాణానికే ప్రమాదం జరిగింది.

ఇలాంటివి ఎదురైనా సాహసించి ముందుకు సాగడమే అతని పద్ధతి. సినిమా రంగం నుంచి సహాయ కార్యక్రమాల నిర్వహణ కూడా చేశాడు. 1972లో ఆంధ్రప్రదేశ్‌లో కరువుతో అల్లాడుతున్న ప్రజలకు ఊరట కలిగించేలా సాయాన్ని అందించేందుకు కృష్ణ విరాళాల సేకరణ కార్యక్రమాలు రూపొందించాడు. అంతకుముందు ఇలాంటి సేవా కార్యక్రమాలు చేసిన ఎన్టీ రామారావు స్ఫూర్తితో ఈ పని చేస్తున్నట్టు చెప్పుకున్నాడు. కరువు బాధితుల సహాయ నిధికి సినిమా తారల యాత్ర పేరుతో 1972 అక్టోబరు 28 నుంచి నవంబరు 2 వరకు విజయవాడ, తెనాలి, గుంటూరు, రాజమండ్రి, హైదరాబాద్‌లలో తోటి నటీనటులు, సాంకేతిక నిపుణులను కూడగట్టి కార్యక్రమాలు నిర్వహించాడు. వచ్చిన డబ్బు సహాయ నిధికి అందించారు.
ప్రతీ ఏడాది ఎండాకాలం షూటింగులన్నీ ఊటీలోనే ప్లాన్ చేసుకునేవాడు. అటుపక్కన సినిమాలకు అవసరమైన పని చేస్తూనే, దాన్ని ఒక వేసవి ఆటవిడుపుగా ఉపయోగించుకునేవాడు. హీరోగా తొలి అవకాశాలు ఇచ్చి తన జీవితం మలుపు తిప్పిన ఆదుర్తి సుబ్బారావు, డూండీల పట్ల కృష్ణ ఎప్పుడూ కృతజ్ఞతతో వ్యవహరించాడు. ఆదుర్తి సుబ్బారావు మరణించినప్పుడు పాడిపంటలు సినిమా కోసం కృష్ణా, గుంటూరు జిల్లాల్లో అవుట్‌డోర్ షూటింగ్ కోసం వెళ్ళిన కృష్ణ, అంత్యక్రియలకు హాజరయ్యేందుకు ఏ దారీ లేకపోతే ద హిందూ పత్రిక వాళ్ళు వాడే ప్రత్యేక విమానంలో వారిని అభ్యర్థించి ప్రయాణించాడు.

ఆదుర్తి కుటుంబాన్ని ఆదుకోవడం కోసం ఆదుర్తి స్వంత బ్యానర్ రవి కళామందిర్ బ్యానర్ మీద లాభం వస్తే ఆదుర్తి కుటుంబం తీసుకునేట్టు, నష్టం వస్తే కృష్ణ భరించేట్టు తాను హీరోగా పంచాయితీ, సిరిమల్లె నవ్వింది, రక్త సంబంధం సినిమాలు చేసిపెట్టాడు. మొదటి రెండూ ఫ్లాప్ అయినా మూడో సినిమా హిట్ అయింది. ఆదుర్తి సుబ్బారావు కొడుకు సాయి భాస్కర్‌ను తన సినిమాల్లో సహాయ దర్శకుడిగా తీసుకుని, తర్వాత దర్శకుడిగా పరిచయం చేస్తూ పచ్చ తోరణం సినిమా చేశాడు. అదీ ఫ్లాప్ కావడంతో, పద్మాలయా టెలీఫిల్మ్స్ ఏర్పాటుచేసి టెలివిజన్ వ్యాపార రంగంలోకి దిగినప్పుడు సాయి భాస్కర్‌కే ఆ బాధ్యతలు అప్పగించి ఎలాగైనా ఆదుర్తి కుటుంబాన్ని సెటిల్ చేయాలని పదే పదే ప్రయత్నించాడు.సినిమా ప్రయత్నాలు చేస్తున్నప్పుడు తనను ఆదరించిన నటుడు కొంగర జగ్గయ్య, రచయిత కొడాలి గోపాలరావు వంటి వారందరినీ తను విజయాల్లో ఉన్నప్పుడు గౌరవంగా చూసుకుని, అవకాశాలు ఇచ్చేవాడు. ఆర్థికంగా చితికిపోయిన తన తోటి కథానాయకులు, స్నేహితులకు ఆర్థికంగా బాసటగా నిలబడేవాడు. అల్లూరి సీతారామరాజు దర్శకుడు వి.రామచంద్రరావు ఆ సినిమా చిత్రీకరణ ప్రారంభం అయిన కొన్నాళ్ళకే అనారోగ్యంతో మరణించడంతో, సినిమాను కృష్ణ స్వయంగా దర్శకత్వం వహించి పూర్తిచేసినా ఘోస్ట్ డైరెక్టరుగానే ఉండిపోయి దర్శకుడిగా వి.రామచంద్రరావు పేరే వేశాడు.

కృష్ణ నటించిన పలు సినిమాలు తెలుగులో కొత్త సాంకేతికతలు, జాన్రాలు పరిచయం చేశాయి. తెలుగులో తొలి జేమ్స్‌బాండ్ సినిమా (గూఢచారి 116), తొలి కౌబాయ్ సినిమా (మోసగాళ్ళకు మోసగాడు), తొలి ఫుల్‌స్కోప్ సినిమా (అల్లూరి సీతారామరాజు), తొలి 70 ఎంఎం సినిమా (సింహాసనం) వంటివి కృష్ణ నటించిన సినిమాలే. వీటితో పాటుగా పండంటి కాపురం, దేవుడు చేసిన మనుషులు, పాడిపంటలు, ఈనాడు, అగ్నిపర్వతం వంటి సూపర్ హిట్ సినిమాలు ఉన్నాయి. ప్రధానంగా 1976-1985 మధ్యకాలంలో కృష్ణ కెరీర్ అత్యున్నత దశకు అందుకుంది. 1964 నుంచి 1995 వరకు కృష్ణ సగటున పదేళ్ళకు వంద సినిమాలు, అంటే ఏడాదికి 10 సినిమాల చొప్పున 300 సినిమాలు పూర్తిచేశాడు. ఇందుకోసం మూడు షిఫ్టులు చొప్పున వేగంగా సినిమాలు పూర్తిచేసేవాడు.

తాను బి.ఎ. చదువుతున్న రోజుల్లో ఏలూరులో అక్కినేని నాగేశ్వరరావుకు జరిగిన సన్మానం, ప్రజాదరణ చూసి సినిమా రంగంలోకి రావాలని నిర్ణయించుకున్న కృష్ణ అత్యంత వేగంగా తాను ఆశించిన ప్రజాదరణ సాధించాడు. కృష్ణకు రికార్డు స్థాయిలో 2500 అభిమాన సంఘాలు ఉండేవి. అతను అత్యున్నత దశలో ఉండగా ఒక సినిమా శతదినోత్సవానికి ఆంధ్రప్రదేశ్ నుంచి మద్రాసుకు 30 వేల మంది అభిమానులు స్వచ్ఛందంగా 400 బస్సుల్లో తరలివచ్చారు. అతనికి ఫిల్మ్‌ఫేర్ సౌత్ జీవిత సాఫల్య పురస్కారం (1997), ఎన్టీఆర్ జాతీయ పురస్కారం (2003), ఆంధ్ర విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్ (2008), పద్మభూషణ్ పురస్కారం (2009) లభించాయి. 1984 నుంచి కాంగ్రెస్ సమర్థకుడిగా వ్యవహరించిన కృష్ణ ఎన్టీఆర్ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ సినిమాలు చేశాడు. 1989లో ఏలూరు నియోజకవర్గం నుంచి లోక్‌సభ సభ్యునిగా గెలుపొందాడు.

కృష్ణ కుటుంబం నుంచి కుమారులు మహేష్ బాబు, రమేష్ బాబు, కుమార్తె మంజుల, చిన్న అల్లుడు సుధీర్ బాబు సినిమా రంగంలోకి వచ్చారు. తోటి నటి అయిన విజయనిర్మలను 1969లో ప్రేమించి రెండవ పెళ్ళి చేసుకున్నాడు. కుమారుడు మహేష్ బాబు పలు విజయాలు అందుకుని ప్రేక్షకుల నుంచి సూపర్ స్టార్ అన్న తండ్రి బిరుదు పొందాడు. విజయ నిర్మల అత్యధిక చిత్రాలు దర్శకత్వం వహించిన మహిళా దర్శకులిగా నిలిచింది. 2010 దశకంలో కృష్ణ నటన నుంచి, రాజకీయాల నుంచి విరమించుకుని విశ్రాంతి తీసుకుంటున్నాడు.😀

Advertisement
Continue Reading
Advertisement

Featured

Teenmar Mallanna: సమంత నాగచైతన్య విడాకులకు ఫోన్ ట్యాపింగ్ కారణం: తీన్మార్ మల్లన్న

Published

on

Teenmar Mallanna: తెలంగాణ రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం సంచలనం రేపుతుంది. ఈ వ్యవహారంలో భాగంగా సరికొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ క్రమంలోనే తీన్మార్ మల్లన్న ఓ వీడియో ద్వారా ఈ వ్యవహారం గురించి మాట్లాడుతూ టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ సెలబ్రిటీ కపుల్ అయినటువంటి సమంత నాగచైతన్య విడాకులు తీసుకొని విడిపోవడానికి కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ కారణమంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఈ సందర్భంగా తీన్మార్ మల్లన్న మాట్లాడుతూ..నటి ఫోన్‌ ట్యాపింగ్‌ చేశారని, ఆమెతో భేరసారాలు చేశారని, అది వర్కౌట్‌ కాకపోవడంతో హీరో ఫ్యామిలీకి ఈ వీడియో ఇచ్చేశారని ఆయన వెల్లడించారు. సమంత, చైతూ విడిపోవడంలో ఓ పెద్ద పొలిటికల్‌ లీడర్‌ ప్రమేయం ఉందని వెల్లడించారు.

ఈయన రాజకీయ నాయకుడు మాత్రమే కాకుండా మందుల వ్యాపారాలను కూడా నిర్వహిస్తున్నారు అని తెలిపారు. ఇలా ఈమె ఫోన్ ట్యాపింగ్ చేసి ఆ వీడియోలను అక్కినేని ఫ్యామిలీకి పంపించడంతోనే అక్కినేని కుటుంబంలో విభేదాలు రావడం నాగచైతన్య తనకు విడాకులు ఇవ్వడం జరిగింది అంటూ తీన్మార్ మల్లన్న తెలిపారు.

Advertisement

పొలిటికల్ లీడర్..
ఈ విధంగా సమంత నాగచైతన్య విడిపోవడం వెనక ఉన్నటువంటి కారణం ఇదే అంటూ ఈయన చేసినటువంటి వ్యాఖ్యలు ప్రస్తుతం సంచలనగా మారాయి. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉంది ఏంటి అనేది మాత్రం తెలియాల్సి ఉంది. ఇక సమంత నాగచైతన్య విషయానికొస్తే వీళ్లిద్దరు విడాకులు తీసుకొని విడిపోయిన తర్వాత కెరియర్ పరంగా ఇండస్ట్రీలో బిజీగా గడుపుతున్నారు.

Advertisement
Continue Reading

Featured

Anasuya: పవన్ కళ్యాణ్ గొప్ప లీడర్.. పిలిస్తే జనసేన ప్రచారానికి వెళ్తా: అనసూయ

Published

on

Anasuya: బుల్లితెర యాంకర్ గా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి అనసూయ ప్రస్తుతం వెండితెర నటిగా ఇండస్ట్రీలో ఎంతో బిజీగా గడుపుతున్నారు. ఇలా నటిగా వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నటువంటి ఈమె ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొని చేస్తున్నటువంటి పొలిటికల్ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

sut

ఈ సందర్భంగా అనసూయ మాట్లాడుతూ నాకు రాజకీయాలంటే అసలు ఏ మాత్రం ఇష్టం లేదు. కానీ మా నాన్న రాజకీయాలలోకి వెళ్లేవారని నాకు ఇష్టం లేకపోవడంతోనే తనని మాన్పించానని ఈమె తెలిపారు. అయితే నేను కూడా ఈ సొసైటీలో ఉన్నాను కనుక సొసైటీ కి ఒక మంచి నాయకుడిని ఎన్నుకోవాల్సిన బాధ్యత మనపై ఉంటుందని ఈమె తెలిపారు.

ఇక మీరు అడిగారు కాబట్టే నేను చెబుతున్నాను ఇలా మాట్లాడితే వివాదం జరుగుతుందని కూడా నాకు తెలుసు కానీ మనం ఓటు వేసేటప్పుడు పార్టీలను చూడకూడదని, నాయకులను మాత్రమే చూడాలని తెలిపారు. ఆ నాయకుడు సమర్థవంతుడా కాదా అనే విషయాలను మాత్రమే పరిగణలోకి తీసుకోవాలని ఈమె తెలిపారు. ఇక నా విషయానికి వస్తే పవన్ కళ్యాణ్ ఒక గొప్ప లీడర్ అని తెలిపారు.

Advertisement

పార్టీని కాదు, నాయకుడిని చూడాలి..
పవన్ కళ్యాణ్ గారు పిలిస్తే తప్పకుండా నేను జనసేన పార్టీ ప్రచార కార్యక్రమాలకు కూడా వెళ్తాను అంటూ ఈ సందర్భంగా అనసూయ వెల్లడించారు అయితే ఇది నా అభిప్రాయం మాత్రమేనని, ఎవరి అభిప్రాయాలు ఏజెండాలు వారికి ఉంటాయని ఈ సందర్భంగా అనసూయ ఈ సందర్భంగా జనసేన పార్టీకి మద్దతుగా చేసినటువంటి ఈ పొలిటికల్ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Advertisement
Continue Reading

Featured

Ananya Nagalla: ఆ హీరో లాంటి భర్త కావాలంటున్న పవన్ హీరోయిన్.. అమ్మడి ఆశలు మామూలుగా లేవు?

Published

on

Ananya Nagalla: అనన్య నాగళ్ళ పరిచయం అవసరం లేని పేరు. ఈమె ప్రియదర్శి హీరోగా నటించిన మల్లేశం అనే సినిమా ద్వారా హీరోయిన్గా ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. ఈ సినిమా ద్వారా తన నటనతో ప్రేక్షకులను మెప్పించినటువంటి ఈమెకు తదుపరి పలు సినిమాలలో నటించే అవకాశాలు వచ్చాయి. ఇలా పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన వకీల్ సాబ్ సినిమాలో కూడా కీలక పాత్రలో నటించి ప్రేక్షకులను మెప్పించారు.

ఈ సినిమా తర్వాత ఈమె వరుస సినిమా అవకాశాలను అందుకుంటూ కెరియర్ పరంగా ఎంతో బిజీ అయ్యారు. ఇటీవల అనన్య నటించిన తంత్ర అనే సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సస్పెన్స్ థ్రిల్లర్ మూవీగా ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి ఈ సినిమా ప్రేక్షకులను పెద్ద ఎత్తున ఆకట్టుకుంది. ఇక ఈ సినిమా మార్చి 15వ తేదీ విడుదల అయ్యి మంచి సక్సెస్ కావడంతో ఈమె వరస ఇంటర్వ్యూలకు హాజరవుతున్నారు.

ఇలా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి ఈమె తన వ్యక్తిగత విషయాల గురించి తెలియజేశారు. తనకు కాబోయే భర్తలో ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి అనే ప్రశ్న ఎదురయింది. ఈ ప్రశ్నకు అనన్య సమాధానం చెబుతూ నాకు కాబోయే భర్త ఎలా ఉండాలి అంటే హాయ్ నాన్న సినిమాలో హీరో నాని క్యారెక్టర్ ఉంది కదా అలాంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి అబ్బాయి భర్తగా రావాలని కోరారు.

Advertisement

హీరో నాని..
గ్రీన్ ఫ్లాగ్ అయ్యి ఉండాలి… రిలేషన్షిప్స్ అంటే ఎప్పుడు హ్యాపీగా ఫ్రెండ్స్ లా ఉండాలనీ కోరుకునే అబ్బాయి భర్తగా రావాలి అంటూ ఈమె తనకు కాబోయే భర్తలో ఉన్న క్వాలిటీస్ గురించి ఈ వ్యాఖ్యలు చేయడంతో ఇవి కాస్త వైరల్ గా మారాయి. ఇది చూసినటువంటి నెటిజన్ లు అమ్మడికి కోరికలు మామూలుగా లేవుగా అంటూ కామెంట్లు చేస్తున్నారు.

Advertisement
Continue Reading
Advertisement

Trending

Don`t copy text!