పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న ‘హరి హర వీరమల్లు’ సినిమా విడుదలకు సమయం దగ్గరపడింది. ఈ చారిత్రక యాక్షన్ ఎంటర్‌టైనర్ జూలై 24న గ్రాండ్‌గా ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే బుధవారం రాత్రి నుంచే ప్రీమియర్ షోలు ప్రారంభం కానుండటంతో అభిమానుల్లో పండగ వాతావరణం నెలకొంది. ఇప్పటికే యూఎస్‌లో కొన్ని థియేటర్లలో ప్రీమియర్ షోలు ప్రారంభమయ్యాయి. ట్రైలర్‌కి వచ్చిన అద్భుత స్పందన సినిమాపై అంచనాలను మరో స్థాయికి తీసుకెళ్లింది.

కథనం, పవన్ కళ్యాణ్ పాత్ర హైలైట్స్
సినిమా ప్రారంభమైన తొలి 15 నిమిషాల్లోనే ప్రేక్షకులు కథలో లీనమవుతారని ప్రేక్షకుల అభిప్రాయం. కథ భారతదేశ చరిత్ర నేపథ్యంతో ప్రారంభమవుతుందని సమాచారం. దాదాపు 20 నిమిషాల తర్వాత పవన్ కళ్యాణ్ గ్రాండ్ ఎంట్రీ ఉంటుందని, ఆ సీన్ థియేటర్‌లో గూస్‌బంప్స్ తెప్పించేలా ఉంటుందని చెబుతున్నారు. మొదటి భాగంలో ప్రేమకథతో పాటు కామెడీ సన్నివేశాలు ప్రేక్షకులను అలరిస్తాయని తెలుస్తోంది. ముఖ్యంగా ఇంటర్వెల్ సీక్వెన్స్‌లో వచ్చే ఫైట్ సీన్ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనుందని సోషల్ మీడియాలో ఇప్పటికే టాక్ రాగా, రెండవ భాగంలో వచ్చే రెండు యాక్షన్ ఎపిసోడ్‌లు, ప్రత్యేకంగా క్లైమాక్స్ భారీ హైలైట్‌గా నిలుస్తుందని అభిమానులు చెబుతున్నారు.
ఇక సినిమా మొత్తంలో పవన్ కళ్యాణ్ పాత్రకు రాజకీయ సెటైర్లు, సనాతన ధర్మంపై చెప్పే డైలాగులు ప్రత్యేక ఆకర్షణగా ఉండబోతున్నాయని తెలుస్తోంది. సినిమాలో వచ్చే కొన్ని భావోద్వేగ సన్నివేశాలు కూడా అభిమానుల హృదయాలను తాకుతాయంటున్నారు. అభిమానుల అభిరుచులకు తగ్గట్టు పవన్ క్యారెక్టర్ పవర్‌ఫుల్‌గా డిజైన్ చేసినట్టు సమాచారం.
సాంకేతిక వర్గం, అంచనాలు
ఈ చిత్రానికి జ్యోతి కృష్ణ దర్శకత్వం వహించగా, ఏఎం రత్నం భారీ బడ్జెట్‌తో నిర్మించారు. నిధి అగర్వాల్ ఇందులో హీరోయిన్‌గా నటించింది. ఎంఎం కీరవాణి సంగీతం అందించగా, టెక్నికల్ వర్గం మొత్తం హై స్టాండర్డ్స్‌లో పనిచేసిందని యూనిట్ చెబుతోంది. యూఎస్ ప్రీమియర్ షోలతో వచ్చిన మొదటి టాక్ పాజిటివ్ వైబ్‌ను కలిగిస్తుండగా, మంగళవారం ఉదయం నుంచి మొదలయ్యే రెగ్యులర్ షోలపై ఇండస్ట్రీలో ఆసక్తి నెలకొంది. మొత్తంగా ‘హరి హర వీరమల్లు’ సినిమాతో పవన్ మరోసారి తన స్థాయిని నిరూపించబోతున్నారని అభిమానులు విశ్వసిస్తున్నారు.































