తెలంగాణలో దళితుల అభివృద్దే లక్ష్యంగా సీఎం స సీఎం కేసీఆర్ పనిచేస్తున్నారని అన్నారు ఆర్థికశాఖ మంత్రి హరీష్ రావు. సోమవారం సిద్దిపేట జిల్లాలో మంత్రి పర్యటించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ..

రానున్న రెండేళ్లల్లో దళితులకు లక్షకోట్ల రూపాయిలు కేటాయించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచన చేస్తున్నారని పేర్కొన్నారు. అన్ని వర్గాల అభ్యున్నతే ధ్యేయంగా సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారన్నారు. దళిత బంధువుడు దేశానికి ఆదర్శంగా నిలుస్తుందని హరీష్రావు స్పష్టం చేశారు.





























