Connect with us

Political News

Harish Rao : ఆయకట్టుకు నీళ్లు అందించండి.. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి లేఖ రాసిన హరీష్ రావు!

Published

on

Harish Rao : సిద్దిపేట ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్‌రావు నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌ కుమార్‌రెడ్డికి లేఖ రాశారు. సిద్దిపేట జిల్లాలోని అన్నపూర్ణ (అంతగిరి) రిజర్వాయర్, రంగనాయక సాగర్, మల్లన్న సాగర్, కొండ పోచమ్మ సాగర్లు పూర్తిగా నీళ్లు లేక రిజర్వాయర్లు అడుగంటి పోయే పరిస్థితికి చేరుకున్నాయి. ఒకవైపు రిజర్వాయర్లలో నీళ్లు లేక, మరోవైపు వర్షాలు కురవక రైతులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. పంటలు వేయాలా వద్దా అనే అయోమయంతో రైతులు ఆవేదన చెందుతున్నారు. గత సంవత్సరం ఇదే సమయంతో పోలిస్తే జిల్లాల పంటల సాగు విస్తీర్ణం కూడ తగ్గి పోయింది.

Advertisement

కాబట్టి రాజకీయాలు పక్కనబెట్టి మిడ్ మానెర్ నుండి అన్నపూర్ణ రిజర్వాయర్, రంగనాయక సాగర్, మల్లన్న సాగర్, కొండ పోచమ్మ సాగర్ లకు నీటిని పంపింగ్ చేసేలా ఇరిగేషన్ అధికారులకు వెంటనే ఆదేశాలు జారీ చేయాలని, అదేవిధంగా కాలువల ద్వారా నీటిని విడుదల చేసి ఆయకట్టుకు నీళ్లందించేలా చర్యలు తీసుకోవాలని జిల్లా రైతాంగం పక్షాన కోరుతున్నాను” అంటూ ఎమ్మెల్యే హరీష్ రావు లేఖ రాసారు.

Advertisement

Featured

TDP MLA: చెల్లి అంటూనే మహిళతో టీడీపీ ఎమ్మెల్యే రాసలీలలు.. వైరల్ అవుతున్న వీడియో?

Published

on

TDP MLA: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు ఎప్పుడు సంచలనంగానే ఉంటాయి. ఇటీవల కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ప్రతిపక్ష పార్టీ అయినటువంటి వైకాపా పార్టీ నాయకులకు సంబంధించిన ఎన్నో అక్రమ సంబంధాలు వెలుగులోకి వచ్చిన సంగతి మనకు తెలిసిందే. ఇలా ఒక్కొక్కటి వెలుగులోకి వస్తున్నటువంటి తరుణంలో వైకాపా నాయకులు కూడా ఈ ఘటనలపై స్పందిస్తున్న సంగతి తెలిసిందే.

Advertisement

ఇకపోతే తాజాగా మరొక ఘటన వెలుగులోకి వచ్చింది.సత్యవేడు టీడీపీ ఎమ్మెల్యే ఆదిమూలం రాసలీలలకు సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోలో భాగంగా హోటల్ గదిలో ఒక మహిళతో ఆదిమూలం ఎంతోచనువుగా ఉన్నారు. చెల్లి అంటూనే మహిళ పట్ల లైంగికంగా దాడి చేసినట్టు తెలుస్తోంది.

ఇక ఈ వీడియో పై సదురు బాధిత మహిళ స్పందిస్తూ అధికారాన్ని అడ్డుపెట్టుకొని తనపై ఒత్తిడి తీసుకు వచ్చి తనపై లైంగికంగా దాడి చేశారని ఆమె ఆరోపణలు చేశారు. దీంతో ఎమ్మెల్యే ఆదిమూలం ఈ వీడియో పట్ల స్పందిస్తూ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. అయితే ఈ వీడియోని కొందరు టిడిపికి చెందిన ఎమ్మెల్యేలే ఇలా మార్ఫింగ్ చేశారని ఆయన ఆరోపణలు చేశారు.

మార్ఫింగ్ చేశారు..
తాను ఎలాంటి వ్యక్తి అనే విషయం ఈ నియోజకవర్గ ప్రజలందరికీ తెలుసు. కొందరు ఉద్దేశపూర్వకంగానే తనపై బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారని, ఈ వీడియోకి తనకు ఏ విధమైనటువంటి సంబంధం లేదని తన పట్ల వస్తున్నటువంటి వార్తలను పూర్తిగా ఖండించారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది.

Advertisement

Advertisement
Continue Reading

Featured

Nagababu: రేవంత్ రెడ్డి హైడ్రా నిర్ణయం పై నాగబాబు ప్రశంసలు… ఆంధ్రా సమస్యలు పట్టవా అంటూ?

Published

on

Nagababu: సినీ నటుడు నాగబాబు సోషల్ మీడియా వేదికగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై ప్రశంసల వర్షం కురిపించారు. ప్రస్తుతం రేవంత్ రెడ్డి హైడ్రా ద్వారా అక్రమంగా చెరువులు, ప్రభుత్వ స్థలాలను ఆక్రమించి నిర్మాణాలు చేపట్టిన వాటిపై ఉక్కు పాదం మోపుతున్న సంగతి తెలిసిందే. ఎంత పెద్ద వారైనా సరే ఆ కట్టడాలను కూల్చి వేస్తున్నారు. ఇటీవల నాగార్జున ఎన్ కన్వెన్షన్ సెంటర్ ను కూడా కూల్చివేశారు.

Advertisement

ఇలా పెద్దవారి నిర్మాణాలని కూల్చివేస్తుంటే ఎంతో మంది గుండెల్లో గుబులు పుడుతుంది ఇలాంటి తరుణంలోనే నాగబాబు సోషల్ మీడియా వేదికగా రేవంత్ రెడ్డి పై ప్రశంసలు కురిపిస్తూ చేసిన పోస్ట్ వైరల్ అవుతుంది. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాలలో విపరీతంగా వర్షాలు కురవడంతో వాగులు వంకలు పొర్లుతున్నాయి అలాగే ఎంతోమంది ఆస్తి నష్టం ప్రాణ నష్టం కూడా ఎదుర్కొంటున్నారు.

ఇలా వరదలు రావడానికి కారణం అక్రమంగా చెరువులను కుంటలను ఆక్రమించి నిర్మాణాలు చేపట్టడమే అంటూ నాగబాబు తెలిపారు.. వర్షాలు పడి వాగులు, వంకలు తూములు తెగిపోయి నీళ్లు వస్తూ అపార్ట్మెంట్లు కూడా మునుగుతున్నాయి. తద్వారా ఎంతోమంది ప్రాణాలను కూడా కోల్పోయారు.ఇది చాల బాధకారం వీటికి ముఖ్య కారణం చెరువుల్ని నాళాలని అక్రమ కబ్జా చేసి నిర్మాణాలు చేయడమే .. ఇప్పటికైన అర్ధమైందా తెలంగాణ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేబట్టిన హైడ్రా కాన్సెప్ట్..

కరకట్ట ఇంటి గురించి మాట్లాడండి..
ఇలాంటి ఒక కఠిన నిర్ణయం తీసుకున్నప్పుడే మనం వారికి సపోర్ట్ చేయాలి.పర్యావరణాన్ని మనం రక్షిస్తే అది మనల్ని రక్షిస్తుంది, అదే పర్యావరణాన్ని మనం భక్షిస్తే కచ్చితంగా అది శిక్షిస్తుంది‌.. కచ్చితంగా అంటూ నాగబాబు పోస్ట్ చేయడంతో కొంతమంది మీకు ఆంధ్రాలో ఉన్న సమస్యలు కనిపించడం లేదా.. ఒకవైపు కరకట్ట మీదే ఇల్లు కట్టుకున్నారు. ఆ సంగతి ఏంటి అంటూ చంద్రబాబు గురించి కామెంట్లు చేయగా, మరికొందరు ఇంజనీరింగ్ కాలేజీలో రహస్య కెమెరాల ఘటనపై స్పందించండి అంటూ ఈయన పట్ల విమర్శలు చేస్తున్నారు.

Advertisement

Advertisement
Continue Reading

Featured

Roja: వైయస్ జగన్ పెళ్లిరోజు… పార్టీ మారడంపై క్లారిటీ ఇచ్చిన రోజా!

Published

on

Roja: సినీ నటి, వైకాపా నాయకురాలు మాజీ మంత్రి ఆర్కే రోజా గురించి కథ కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. ఈమె పది సంవత్సరాల పాటు ఎమ్మెల్యే గాను అలాగే జగన్ హయాంలో మంత్రిగా కూడా బాధ్యతలు తీసుకున్నారు. ఇలా నగరి నియోజకవర్గం నుంచి రెండుసార్లు ఎన్నికలలో విజయం సాధించిన రోజుకు ఈసారి చేదు అనుభవమే ఎదురైంది.

Advertisement

రోజా మాత్రమే కాకుండా వైకాపా పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు అందరూ కూడా ఘోరంగా ఓడిపోయారు. దీంతో వైకాపాకు చెందిన మాజీ ఎమ్మెల్యేలు మంత్రులందరూ కూడా ప్రస్తుతం మౌనం పాటిస్తున్నారు అయితే గతంలో రోజా ఫైర్ బ్రాండ్ గా తెలుగుదేశం పార్టీ అలాగే జనసేన పార్టీ నేతలపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇప్పుడు కూటమి ప్రభుత్వ అధికారంలోకి రావడంతో రోజా సైలెంట్ అవ్వడమే కాకుండా ఆంధ్రలో కాకుండా తమిళనాడులోని ఎక్కువగా ఉంటున్న సంగతి తెలిసిందే. అంతేకాకుండా తమిళనాడు రాజకీయాలపై ఈమె ఫోకస్ చేశారని వైకాపాకు గుడ్ బై చెబుతూ తమిళ నటుడు విజయ్ పార్టీలో చేరబోతున్నారు అంటూ గత కొద్దిరోజులుగా పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి.

అన్నా వదిన అంటూ
ఇక తాజాగా ఈ వార్తలకు రోజా ఒక్క మాటతో క్లారిటీ ఇచ్చారు నేడు వైయస్ జగన్మోహన్ రెడ్డి భారతి పెళ్లిరోజు కావడంతో ఈమె సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ..ఏళ్ళన్నీ గడచినా చెదరని మీ అనుబంధం… ఇలాగే కలకాలం సాగాలని ఆశిస్తూ… అన్నా వదినలకి హృదయపూర్వక పెళ్ళిరోజు శుభాకాంక్షలు అంటూ పేర్కొన్నారు. రోజా ఇలా జగన్మోహన్ రెడ్డి, భారతి దంపతులకు పెళ్లిరోజు శుభాకాంక్షలు అని తెలియజేయడంతో ఈమె పార్టీ మారుతుంది అంటూ వస్తున్న వార్తలలో ఏమాత్రం నిజం లేదని స్పష్టంగా తెలుస్తోంది ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ అవుతుంది.

Advertisement

Advertisement
Continue Reading
Advertisement

Trending

Don`t copy text!