చైనా నుంచి వ్యాప్తి చెందిన కరోనా మహమ్మారి విజృంభణ అంతకంతకూ పెరుగుతున్న సంగతి తెలిసిందే. వ్యాక్సిన్, మందులు అందుబాటులోకి రాకపోవడంతో వైరస్ ను అదుపు చేయడం కష్టమవుతోంది. దేశంలో ప్రతిరోజూ 70,000కు పైగా నమోదవుతున్న కేసులు ప్రజలను మరింత భయాందోళనకు గురి చేస్తున్నాయి. వందల సంఖ్యలో కరోనా మరణాలు నమోదవుతున్నాయి. వైరస్ కు పలు వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చినా సమర్థవంతమైన వ్యాక్సిన్ అందుబాటులోకి రాలేదు.

అయితే తాజాగా ముంబై పోలీసులు వైరస్ శరవేగంగా వ్యాప్తి చెందుతున్న తరుణంలో చేసిన ట్వీట్ తెగ వైరల్ అవుతోంది. ఎవరికైనా కరోనా వైరస్ నిర్ధారణ అయితే బొమ్మా బొరుసు ఆడాలని బొమ్మ పడితే కరోనా వైరస్ ను తప్పక జయిస్తారని పేర్కొన్నారు. పోలీసులు ఇలాంటి ట్వీట్ పెట్టడం ఏంటని ఆశ్చర్యపోతున్నారా…? అందులోనే అసలు లాజిక్ ఉంది. పోలీసులు పెట్టిన ట్వీట్ లోనే హెడ్స్, టెయిల్స్ కు సంబంధించిన ఇమేజ్ ను పెట్టారు.
ఆ ఇమేజ్ లో ఒకదానిపై నలుపు తెలుగు రంగులలో కనిపించే ఇల్లు, ఇంటిలో మాస్క్ పెట్టుకున్న వ్యక్తి బొమ్మ పెట్టారు. దీనిని హెడ్స్ గా పేర్కొన్నారు. హెడ్స్ పెడితే కరోనా సోకితే ఇంట్లో ఉండాలని కరోనా లేకుండా ఉంటే బయటకు వస్తే మాస్క్ ధరించాలని అర్థం. అలా కాకుండా టెయిల్స్ పడితే కరోనా వైరస్ ఓడిపోతుందని అర్థం వచ్చేలా ఇమేజ్ ను డిజైన్ చేశారు. పోలీసులు చేసిన ట్వీట్ నెట్టింట వైరల్ అవుతూ నెటిజన్లను ఆకర్షిస్తోంది.
Not wearing a mask when out makes no 'cents'. #PennyForTheWise#TakingOnCorona pic.twitter.com/WefUS2fP8f
— Mumbai Police (@MumbaiPolice) September 24, 2020
మహారాష్ట్ర రాష్ట్ర పోలీసులు భలే చెప్పారే..? అంటూ కొందరు నెటిజన్లు సోషల్ మీడియాలో మహారాష్ట్ర పోలీసుల తెలివితేటలను ప్రశంసిస్తున్నారు. కరోనా విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి సూటిగా స్పష్టంగా చెప్పారని పేర్కొంటున్నారు. మరోవైపు దేశంలో అత్యధికంగా మహారాష్ట్రలో కరోనా కేసులు నమోదైన సంగతి తెలిసిందే.



























