అన్ని దేశాలతో పోలిస్తే భారత దేశం లో వంట నూనె ఎక్కువ గా ఉపయోగిస్తారు. ఇండియా లో తృప్తిగా భోజనం చేయాలి అనుకుంటారు. అందుకోసం పొద్దున టిఫిన్ మొదలుకొని రాత్రి భోజనం వరకు కూడా నూనె ఎక్కువ ఉపయోగిస్తారు. వంట నూనె నాణ్యమైన ది ఎంపిక చేసుకోవడం వలన అనారోగ్య సమస్యలు, గుండె సంబంధ వ్యాధులు రాకుండా కాపాడుతుంది. నూనె లో కొవ్వు శాతం ఎక్కువగా ఉండేవి కాకుండా ఎంచుకోవాలి.

నూనెలో ఉండే ఒమేగా 3 ప్యాటి ఆసిడ్స్, యాంటీ ఆక్సడెంట్లు, న్యూట్రియన్స్, ఖనిజాలు, గుండె చక్కగా పని చేయడానికి ఉపయోగపడతాయి. అదే విధంగా చర్మ సంబంధిత వ్యాధులు రాకుండా చేస్తాయి. అంతేకాకుండా రోజు శరీరానికి కావాల్సిన శక్తిని, రోగనిరోధశక్తిని మెరుగుపరచడానికి దోహదం చేస్తాయి. ఇక ఆలస్యం లేకుండా ఆ నూనెలు ఏమిటో, వాటి యొక్క ఉపయోగాలు ఏంటో తెలుసుకుందాం.
1. ఆలివ్ ఆయిల్:

ఈ ఆయిల్ లో కొవ్వు శాతం తక్కువ గా వుండి, శరీరానికి కావాల్సిన పోషకాలు అన్ని వుంటాయి. బరువు తగ్గాలి అనుకునే వారు ఆలివ్ ఆయిల్ ని వంటలలో చేర్చుకుంటే రోజు శరీరానికి కావల్సిన తక్షణ శక్తిని ఇస్తాయి.. అదే విధంగా చర్మ సౌందర్యంలో కూడా ఆలీవ్ ఆయిల్ ఉపయోగపడుతుంది.. అన్ని రకాలు వంటలకు ఈ నూనె అనువుగా ఉంటుంది. వేపుడులు, గ్రిల్లింగ్ కి సంబందించిన అన్ని వంటలకు ఈ ఆలీవ్ ఆయిల్ ను ఉపయోగిస్తారు.
2. రైస్ బ్రౌన్ ఆయిల్ (తౌడు ఆయిల్):

ఈ ఆయిల్ రైస్ పై పొర నుండి తయారు చేయబడుతుంది. ఇది శరీరానికి కావాల్సిన మోనో అన్ శాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్, పాలి అన్శాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ లను సమతుల్యంగా ఉంచుతుంది. ఇవి శరీరంలో యాంటీ ఆక్సిడెంట్లు పెంచి రోగనిరోధక శక్తిని పెరగడానికి ఉపయోగపడుతుంది. రక్తనాళాలను శుభ్రం చేసి, గుండెలోని కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గిస్తుంది.
3. కోకోనట్ ఆయిల్:

కొబ్బరి నూనెలో కొవ్వు శాతం చాలా తక్కువ ఉంటుంది. ఈ నూనె గుండెకి ఎంతో మేలు చేస్తుంది అని పలు అధ్యయనాల్లో ఇప్పటికే వెల్లడైంది. బాగా ఎండ పెట్టిన కొబ్బరి ముక్కల నుండి ఈ నూనె ను తీస్తారు. ఈ నూనెలో సల్ఫర్, స్మోక్ వంటి చెడును కలిగించేవి ఉండవు. ఇందులోని సాలిడ్స్ ను తీసి నాణ్యమైన నూనెను తయారుచేయడం వలన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.
4. ఆవ నూనె:

ఈ నూనెను ఇండియన్ అసోసియేషన్ సిఫార్స్ చేయడం ఒక విశేషం. ఆవ నూనెలో పుష్కలంగా విటమిన్ లు లభిస్తాయి. చెడు కొలెస్ట్రాల్ ను నియంత్రిస్తుంది. గుండె సంబంధ వ్యాధుల నుండి కాపాడుతుంది. ఒమేగా 3, ఒమేగా 6, విటమిన్ ఎ, డి, కె విటమిన్స్ ఉండటం వల్ల ఆరోగ్యానికి ఏంతో మేలు చేస్తుంది.
































