Heart Attack: ఇటీవల కాలంలో చిన్నపిల్లల నుంచి మొదలుకొని పెద్దవారి వరకు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలలో గుండెపోటు సమస్య ఒకటి. గతంలో 50 సంవత్సరాలకు పైబడిన వారు ఇలాంటి సమస్యతో బాధపడేవారు కానీ ఇప్పుడు 10 సంవత్సరాల వయసులోపు వారు కూడా ఈ గుండెపోటు సమస్యతో బాధపడుతూ మరణిస్తున్నారు. తాజాగా మూడో తరగతి చిన్నారి పాఠశాలలో ఉన్నఫలంగా కుప్పకూలి పడిపోయిన ఘటన ఎంతో హృదయ విధారకంగా మారింది.

అహ్మదాబాద్‌లోని థాల్తేజ్ ప్రాంతంలోని జెబార్ స్కూల్‌లో గార్గి అనే 8 ఏళ్ల చిన్నారి మూడో తరగతి చదువుతోంది. ఎప్పటిలాగే రోజు పాఠశాలకు వచ్చింది అయితే ఆమె పాఠశాలకు వచ్చిన కాసేపటికే తీవ్ర అస్వస్థతకు గురి అయ్యారు. ఇలా గుండెలో తీవ్రమైన నొప్పి రావడంతో చిన్నారి గార్గి ఒకసారిగా కుప్పకూలి పడిపోయారు. ఇలా ఆ చిన్నారి పడిపోవడంతో ఉపాధ్యాయులు వెంటనే గమనించి చిన్నారిని స్థానిక జైడస్ ఆస్పత్రికి తీసుకెళ్లారు.
హాస్పిటల్ కి తీసుకెళ్లిన చిన్నారికి వైద్యులు చికిత్స ప్రారంభించారు. ఇలా ప్రాథమిక చికిత్స జరుగుతున్న నేపథ్యంలోనే చిన్నారి మరణించినట్లు వైద్యులు వెల్లడించారు. ఇక ఈమె గుండెపోటుతోనే మరణించినట్లు వైద్యులు ప్రకటించారు.గార్గి అస్వస్థతకు గురవడాన్ని సీసీటీవీ ఫుటేజీలో చూశామని ఆ పాఠశాల ప్రిన్సిపాల్ శర్మిష్ట సిన్హా తెలిపారు. అయితే చిన్నారికి ఎలాంటి అనారోగ్య సమస్యలు లేవని తల్లిదండ్రులు తెలిపారు.
ముంబైకు చెందిన గార్గి అహ్మదాబాద్‌లో తన తాతయ్యలతో కలిసి నివసిస్తోంది. పాప మృతి పట్ల ఉపాధ్యాయులు తోటి విద్యార్థులు సంతాపం తెలియజేశారు.
సీసీ ఫుటేజ్.. గుండెపోటుతో 8 ఏళ్ల చిన్నారి మృతి !
— TeluguDesk (@telugudesk) January 11, 2025
గుజరాత్ – అహ్మదాబాద్‌లో మూడో తరగతి విద్యార్థిని గార్గి(8) క్లాస్‌కి వెళ్తుండగా అస్వస్థతకు గురైంది. అక్కడే ఉన్న చైర్‌లో కూర్చున్న ఆమె అలాగే కుప్పకూలిపోయి మృతిచెందింది. pic.twitter.com/fIgoJDGn3D



























