సాయి ధరమ్ తేజ్ తెలుగు నటుడు “మెగాస్టార్” చిరంజీవికి మేనల్లుడుగా సినీ రంగ ప్రవేశం చేసిన సాయి తేజ్ వై.వి.ఎస్. చౌదరితో “రేయ్” సినిమాతో సినీ రంగంలో అడుగు పెట్టి “పిల్లా నువ్వులేని జీవితం” సినిమాతో తెరంగేట్రం చేసాడు. వరుస హిట్లు కాకపోయినా… కొన్ని అపజయాలను కూడా చూస్తూ… తన కెరీర్ ని ముందుకు సాగే దిశలో అడుగులేస్తున్నారు సాయి తేజ్.

ఈ మధ్య కాలంలో అంతగా కనిపించని సాయి ధరమ్ తేజ్.. పోయిన సంవత్సరంలో సోలో బతుకే సో బెటర్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చినా అభిమానులను అంతగా అలరించలేకపోయింది. దాంతో ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ పై అత్యంత దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది.

ఇక విషయానికొస్తే హైదరాబాద్ లోని కేబుల్ బ్రిడ్జ్ పై నుంచి ద్విచక్రవాహనంపై వెళ్తున్న సాయి ధరమ్ తేజ్ ఒక్కసారిగా బైక్ అదుపుతప్పి కింద పడిపోయారు. అకస్మాత్తుగా జరిగిన ఈ రోడ్డు ప్రమాదంలో సాయి తేజ్ కి తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని చిరంజీవి, అల్లు అరవింద్ చెప్పుకొచ్చారు.

ఇక తాజా విషయం ఏంటంటే అపస్మారక స్థితి నుంచి బయటికి వచ్చిన సాయి ధరమ్ తేజ్ కుటుంబ సభ్యులతో ఒకే ఒక్క మాట మాట్లాడినట్లుగా తెలుస్తోంది. వీడియో కాల్లో కుటుంబ సభ్యులతో మాట్లాడిన సాయితేజ్ నొప్పిగా ఉందని మాత్రమే చెప్పినట్లు సమాచారం. ఆ మాట తప్ప మరేం మాట్లాడలేదని, అసలు మాట్లాడే పరిస్థితిలో తేజ్ లేరని డాక్టర్లు చెబుతున్నారు. అందువల్లనే కుటుంబ సభ్యులను సైతం డాక్టర్లు అనుమతి నిరాకరించారు. కేవలం వీడియో కాల్ లోనే చూపిస్తూ సమాచారం అందిస్తున్నట్లు తెలుస్తోంది.































