తెలంగాణ రాష్ట్రంలో అక్కడక్కడ నేడు, రేపు వడగళ్ళ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. గడచినా 24 గంటల్లో ఉత్తర కర్ణాటక నుంచి దక్షిణ మధ్య మహారాష్ట్ర వరకు ఉపరితల ద్రోణి, మరట్వాడా నుంచి విదర్బ పరిసర ప్రాంతాలలో ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని పేర్కొంది.

దీని ప్రభావం గురువారం, శుక్రవారాలలో ఆదిలాబాద్, నిర్మల్, జగిత్యాల, నిజామాబాద్, కామారెడ్డి,జిల్లాల్లో కొన్ని చోట్ల ఉరుములు, మెరుపులులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.



























