తెలంగాణలో ఈరోజు, రేపు భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని తెలిపింది హైదరాబాద్ వాతావరణ కేంద్రం. తెలంగాణ పై 1500 మీటర్ల ఎత్తు వరకూ గాలుల విచ్చిన్నత ఏర్పడింది. ఈ క్రమంలో నైరుతీ ఋతుపవనాలు గురువారం కేరలలోకి ప్రవేశించే అవకాశాలు ఉన్నాయని తెలిపింది హైదరాబాద్ వాతావరణ కేంద్రం.

దీని ప్రభావంతో నేడు, రేపు అనగా గురు, శుక్రవారాల్లో కొన్ని చోట్లా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. బుధవారం హైదరాబాద్ సహా పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసాయి. అత్యదికంగా అరుట్లలో 4.5, గచ్చిబౌలీ లో 4.5, ఎర్రారం (నల్గొండ) 4.4, దండుమైలారం ౩.8, మాదాపూర్ లో 2.6 సెంటీమీటర్ల వర్షం కురిసిందని తెలిపింది.































