Hema : తెలుగు చలన చిత్రాలలో సపోర్టింగ్ కారెక్టర్లు చేస్తూ తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది హేమ. ఇప్పటి వరకూ దాదాపు 500 సినిమాలకు పైగా నటించింది. తెలుగు తో పాటు తమిళ్, మలయాళం, హిందీ భాషల్లో నటించింది. సినిమాలు మాత్రమే కాకుండా 3 టీవీ సీరియల్లలో నటించింది. 1989 లో బాలకృష్ణ హీరో గా వచ్చిన భలేదొంగ సినిమా ద్వారా వెండి తెరకు పరిచయం అయ్యింది. మా అసోసియేషన్ తో పాటు రాజకీయాల్లో కూడా చురుకుగా ఉంటుంది హేమ.

అర్ధరాత్రి ఫోన్ చేసి చంపేస్తాం అని బెదిరించారు…
తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న హేమ పలు ఆసక్తికర విషయాలు చెప్పుకోచ్చారు. అసోసియేషన్ లో జరిగిన గత ఎన్నికలలో హేమ, ప్రకాష్ రాజ్ పానల్ నుండి ఉపాధ్యక్ష పదవికి పోటీ చేశారు. అయితే ఈ ఎన్నికల సమయంలో కాస్త గందరగోళం నెలకొన్న సంగతి తెలిసిందే. అయితే ఆ సమయంలో హేమ అవతలి వారిపై పోలీస్ కంప్లైంట్ లాంటివి ఇవ్వడం కూడా జరిగింది. ఈ క్రమంలోనే అర్దరాత్రి పన్నెండున్నర సమయంలో ఒకరు ఫోన్ చేసి “ఏంటే పోలీస్ కంప్లైంట్ చేస్తావా చంపేస్తాం” అంటూ బెదిరించారని చెప్పుకోచ్చింది. వెంటనే హేమ గట్టిగా మాట్లాడటం మొదలు పెట్టగానే ఫోన్ పెట్టేశారని చెప్పింది.
నేను ముస్లింని పెళ్లిచేసుకోవడానికి కారణం ఇదే…

ఇక ఇంటర్వ్యూలో వారి ప్రేమ పెళ్ళి గురించి ప్రస్తావించగా.. వారిది ప్రేమ వివాహం అని తనకు 19 సంవత్సరాల వయస్సులోనే ఇంట్లో చెప్పకుండా రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నాం అని చెప్పింది. దూరదర్శన్ లో పనిచేస్తున్న రోజుల్లో, తన సహనటుడు మీర్ కి తమ్ముడు అయిన జాన్ ఒకరోజు దూరదర్శన్ కి రావడం, నేను ఎగ్జిబిషన్ కి వెళ్తుండగా నేనూ వస్తాను అని అడుగగా సరే అన్నాను. మొదటిసారి కలిసినపుడే మిమ్మల్ని పెళ్లి చేసుకుంటాను అని అడిగాడు. ప్రేమిస్తున్నాను అని ఏదేదో చెప్పకుండా పెళ్లి గురించి అడిగాడు అందుకు వెంటనే ఒప్పసుకున్నాను అని తన పెళ్ళికి గల కారణాన్ని చెప్పింది.































