టాలీవుడ్ లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ లకు ఉన్న ప్రాముఖ్యత ఎలాంటిదో అందరికి తెలిసిందే. సినిమాలో వచ్చే హీరోయిన్ హీరో పాత్రలతో పాటుగా వీరి క్యారెక్టర్ లకు ప్రేక్షకులకు కనెక్ట్ అవుతారు. అందుకే క్యారెక్టర్ ఆర్టిస్ట్ లు కూడా పాపులారిటీ దక్కించుకుంటారు..టాలీవుడ్ లో వీరికి కూడా ఫ్యాన్స్ ఉంటారు అంటే నమ్మాల్సిందే. తెలుగులో చాలామందే క్యారెక్టర్ ఆర్టిస్ట్ లు ఉన్నారు.. వారి వారి పాత్రలతో ప్రేక్షకులను అలరించడంతో పాటు మంచి గుర్తింపు దక్కించుకున్నారు.
వీరిలో సంచలన నటి హేమ కూడా ఉన్నారు.. హేమ గురించి దాదాపు అందరికి తెలుసు.. ఎప్పటినుంచి ఆమె తెలుగు తెరపై కనిపిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. మా ఎలక్షన్స్ టైం లో ఈమె చేసిన హడావుడి అంతా ఇంతా కాదు. తన సినిమాలు తాను చేసుకుంటూ కామ్ గా ఉండే హేమ జోలికి ఎవరైనా వెళితే వాడికి దేత్తడి పోచమ్మ గుడినే.. ఇలాంటి సందర్భాలు చాలానే చూసాం..ఆమధ్య బిగ్ బాస్ లో పాల్గొన్న హేమ ఆ తరవాత ఎక్కువ లైం లైట్ లోకి రాలేదు.. కాగా తాజగా తన భర్తకు అందరి ముందు లిప్ లాక్ ఇచ్చి సోషల్ మీడియా లో ట్రెండ్ అవుతున్నారు..
ఎవరైనా తనని ఆంటీ అని పిలిస్తే కోపం వస్తుందని చెప్తుంది ఆమె.. ఇక హీరోలు ఎవరైనా అలా పిలిస్తే.. సైకిల్ గ్యాప్ కూడా ఇవ్వకుండా.. హీరో షాట్లో ఉన్నా సరే వెళ్లి అలా పిలవద్దు అని చెప్పేస్తుంటుందట. హీరోలు అలా పిలిస్తే.. తనకు వయసు పెరిగిపోయిన ఫీలింగ్ వస్తుందని ఆమె చెబుతుంది. అది నిజమే అయినప్పటికీ ఆమెలో కాన్ఫిడెన్స్ తగ్గిపోతుందని కూడా చెప్పుకొస్తుంది ఈ సీనియర్ నటి.సినిమాల్లో కూడా ఈమె వదిన, అత్త వంటి పాత్రలు పోషిస్తుండడంతో కొంతమంది ఆమెను ఆంటీ అని పిలుస్తుంటారట. ఇక ఇప్పుడు ఈమె తల్లి పాత్రలు కూడా పోషిస్తుండడం గమనార్హం. ఇక ఇటీవల తన భర్త పుట్టినరోజుని స్విమ్మింగ్ పూల్ లో జరిపిన హేమ.. అతనికి డీప్ లిప్ లాక్ కూడా ఇచ్చి ప్రేక్షకులను ఆశ్చర్యపరిచిన సంగతి తెలిసిందే.



























