Hemachandra – Sravana Bhargavi : ఇటీవల కొంతమంది సెలబ్రిటీలు విడాకులు తీసుకున్నట్లుగానే, హేమచంద్ర – శ్రావణ భార్గవీలు కూడా విడాకులు తీసుకోబోతున్నారు అని వారి ఇద్దరి మధ్య మనస్పర్తలు వున్నాయి అని కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఈ వార్తలపై హేమచంద్ర – శ్రావణ భార్గవీలు పరోక్షంగా స్పందించారు.

విడాకులపై క్లారిటీ ఇచ్చిన సింగర్స్…
2013లో ప్రేమించి పెద్దల సమక్షంలో వివాహం చేసుకున్న ఈ జంట 10 ఏళ్ళు కూడా కలిసుండకుండానే విడాకులు తీసుకుంటున్నారు అనడం హాట్ టాపిక్ అయ్యింది. అయితే తాజాగా ఈ వార్తలపై హేమచంద్ర, శ్రావణ భార్గవి స్పందించి క్లారిటీ ఇచ్చారు. శ్రావణ భార్గవి ఈ విషయంపై స్పందిస్తూ.. కొద్దిరోజులుగా నా యూట్యూబ్లో వ్యూస్ పెరిగాయి, ఇంస్టాగ్రామ్ ఫాలోవర్స్ కూడా పెరిగారు. గతంలో కంటే బాగా సంపాదిస్తున్నాను, తప్పో ఒప్పో మీడియా దయ అంటూ శ్రావణ భార్గవి పోస్ట్ చేసి హేమచంద్రను టాగ్ చేసింది.

ఇక ఈ వివాదం పై స్పందించిన హేమచంద్ర ఇలా పోస్ట్ చేశారు.. నా ఇండిపెండెంట్ సాంగ్స్ కంటే కూడా స్టుపిడ్ మరియు అనవసరమైన వార్తలు ఎక్కువ వేగంగా వ్యాప్తి చెందుతుంది. నా ఇంస్టాగ్రామ్ బయోలో ఓ ఇండిపెండెంట్ లవ్ సాంగ్ ఉంది దాన్ని చుడండి ’ అంటూ పోస్ట్ చేసి చీర్స్ భార్గవి అంటూ కాప్షన్ ఇచ్చాడు. ఇలా మొత్తానికి పరోక్షంగా తాము విడాకులు తీసుకోవట్లేదని క్లారిటీ ఇచ్చారు.



























