ఇండియా పోస్ట్ ఆఫీస్ వివిధ రకాల పథకాలను ప్రవేశపెడుతూ వినియోగదారులకు ఆర్థిక భరోసాను కల్పిస్తోంది. తక్కువ డిపాజిట్ తో ఎక్కువ వడ్డీరేటుతో కొన్ని పథకాలను ప్రవేశపెట్టింది. అధిక ఆర్థిక ప్రయోజనాలు పొందేందుకు పోస్టాఫీసు అందిస్తున్న చిన్న పొదుపు పథకాల్లో పెట్టుబడులు పెట్టడం ఉత్తమం మార్గం.

ఇటువంటి పథకంలో రూ.100 నెలకు పొదుపు చేస్తే.. రూ.20 లక్షల వరకు పొందే అవకాశం లభిస్తుంది. ఇలా నెలకు రూ. 100 పెట్టుబడి పెట్టి.. రూ.15 లక్షల వరకు తీసుకెళ్లాలి. తర్వాత రూ.20 లక్షలు పొందొచ్చు. ఇలా పెట్టుబడి పెట్టడం వల్ల మన డబ్బులు సరుక్షితంగా ఉంటుంది.
అంతేకాకుండా పోస్టాఫీసుల్లో ఎలాంటి రిస్క్ ఉండదు. ఇలా నేషనల్ సేవింగ్ సర్టిఫికెట్ ద్వారా వివిధ రకాల ప్రయోజనాలను పొందొచ్చు. నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్ స్కీమ్ మెచూరిటీ పీరియడ్ 5 సంవత్సరాలుగా నిర్ణయించారు. కొన్ని షరతులతో డబ్బులు అవరం అయితే వాటి నుంచి మనం డబ్బులను తీసుకోవచ్చు.
ప్రతీ త్రైమాసికంలో వడ్డీరేట్లను నిర్ణయిస్తున్నారు.
వాటి ప్రకారమే పెట్టుబడి పెట్టిన డబ్బులపై వడ్డీని పొందొచ్చు. ప్రస్తుతం ఈ స్కీమ్ కు వడ్డీరేటును 6.8 శాతంగా నిర్ణయించారు. రూ.1.5 లక్షల వరకు పన్ను రాయితీని కూడా పొందొచ్చు. మొత్తానికి మనం పెట్టే పెట్టుబడి కంటే అదనంగా 5 సంవత్సరాల తర్వాత దాదాపు రూ.6 లక్షల వరకు లాభం పొందొచ్చు. రూ.100 అనేది నెలకు పెట్టుబడి ప్రారంభించొచ్చు.. కానీ కేవలం రూ.100 మాత్రమే నెలకు పెట్టుబడి పెట్టాలని కాదు.. రూ.100 నుంచి వేలల్లో పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది.































