కమల్ హాసన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగు తమిళ ఇండస్ట్రీలలో నటుడిగా లక్షలాది అభిమానుల్ని సంపాదించుకున్నాడు. వైవిధ్యమైన నటనతో సినీ అభిమానులు మనసు దోచుకున్న గొప్ప వ్యక్తి ఆయన. ఆయన్ని పొగడని విమర్శకుడు లేడు అంటూ అతిశయోక్తి లేదు. ఆరేళ్లకే నటప్రస్థానాన్ని ప్రారంభించిన మహానుభావుడు.

సినిమాల్లో నటుడిగా అందరి మన్ననలు పొందిన కమల్ హాసన్ ఈ మధ్యనే రాజకీయాల్లో కూడా అడుగు పెట్టిన సంగతి తెలిసిందే. మక్కల్ నీది మయ్యం అనే పార్టీని స్థాపించి.. ఈ ఏడాది తమిళనాడులో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కోయంబత్తూరు దక్షిణ నియోజకవర్గం నుంచి పోటీ చేసి తన సమీప బీజేపీ అభ్యర్థి వనతి శ్రీనివాసన్ చేతిలో ఓడిపోయిన సంగతి తెలిసిందే.
అయితే ఎన్నో సినిమాలు చేసిన కమల్ హాసన్ ఆస్తి ఇప్పుడు ఎంత అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. రూ. 177 కోట్ల ఆస్తులు తనకు ఉన్నాయని అఫిడవిట్‌లో లెక్కలు చూపించాడు. ఎన్నికల్లో నామినేషన్ వేయడానికి వచ్చిన సమయంలో కమల్ హాసన్ తన ఆస్తుల జాబితాని ప్రభుత్వం ముందు ఉంచారు. 131 కోట్ల స్థిరాస్తులు.. 46 కోట్ల చారాస్తులు తనకున్నట్లు చెప్పాడు.
భారతదేశంలో మాత్రమే కాక విదేశాల్లో కూడా కమల్ హాసన్ కు కోట్లు విలువ చేసే భవనాలు ఉన్నాయి. అంతేకాకుండా కమల్ హాసన్ తనకి యాభై కోట్ల అప్పు కూడా ఉందని గతంలో అఫిడవిట్లో వెల్లడించిన సంగతి తెలిసిందే. లండన్‌లో ఒక భవనం.. కొన్ని లగ్జరీ కార్లు.. రూ. కోటి విలువైన బీఎండబ్యూ కారు ఉన్నట్టు కమల్ హాసన్ తెలిపారు. ప్రస్తుతం కమల్ హాసన్ ఆస్తుల విలువ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.































