Hero J.D. Chakravarthi : శివ సినిమాతో తెలుగులో పరిచయమైన నాగులపాటి శ్రీనివాస చక్రవర్తి కంటే జేడి చక్రవర్తి అనగానే ప్రేక్షకులకు గుర్తిస్తారు. మొదటి సినిమా క్యారెక్టర్ పేరును తన పేరులో పెట్టుకున్న జేడి చక్రవర్తి శివ, సత్య, దెయ్యం, ఎగిరే పావురమా, మనీ, మనీ మనీ అంటూ పలు సినిమాల్లో నటించి మంచి గుర్తంపు తెచ్చుకున్నాడు. గురువు ఆర్జీవి బాటలో హిందీలో అనేక సినిమాల్లో నటించిన జేడీ అటు తమిళం, కన్నడ, మాలయం సినిమాల్లో నటించారు. అలాగే దర్శకత్వం కూడా కొన్ని సినిమాలకు చేసారు. తాజాగా యోట్యూబ్ ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

నాకు స్లో పాయిజన్ ఇచ్చారు… విష్ణు ప్రియతో నా పెళ్లి ఎప్పుడంటే…
చక్రవర్తి గారు ఎపుడూ సినిమాల గురించి వ్యక్తిగత జీవితం గురించి చెప్పాలంటే తన తల్లి గురించి ఎక్కువగా చేప్తారు. అలాంటిది మొదటి సారి ఆయన జీవితంలో చావు అంచుల దాకా వెళ్లిన సంఘటన గురించి చక్రవర్తి వివరించారు. తనకు బాగా కావలసిన వ్యక్తి పేరు చెప్పను అంటూనే తాను నాకు తెలియకుండా ఒక కాషాయం రోజు తాగు అంటూ ఇచ్చారు అందులో విషం కలిపిన విషయం నాకు తెలియలేదు. ఒకరోజు నా దగ్గర పనిచేసే వ్యకి నాకు బాగా సన్నిహితంగా ఉండే వ్యక్తి ఆ కషాయం తాగి వాంతులు చేసుకున్నాడు. అప్పటికీ నాకు అనుమానం రాలేదు. తనకే వెళ్లి ఇలా జరిగిందని చెబితే నీకోసం చేసే కాషాయం వేరేవాళ్లకి ఇస్తావా అంటూ ఫైర్ అయ్యారు. ఇక మెల్లగా నాకు శ్వాస తీసుకోవడంలో యిబ్బందులు మొదలవడంతో చాలా మంది డాక్టర్స్ దగ్గరికి వెళ్ళాను. అయితే నాకు ఎటువంటి చెడు అలవాట్లు లేకపోయినా అనారోగ్య సమస్యలు లేకపోయినా ఎందుకు ఇలా అయిందని బాధపడ్డాను.

99% మరణిస్తానని ఖచ్చితంగా అనుకున్నాక ఒక డాక్టర్ నాకు మాదక ద్రావ్యలకు సంబంధించిన పరీక్షలు నిర్వహించి స్లో పాయిజన్ ఇస్తున్నట్లు నిర్ధారించారు. అలా నేను తాగే కాషాయంలో విషం కలుపుతున్నట్లు అర్థమైంది అని చాలా కొద్ది మందికి మాత్రమే ఈ విషయం తెలుసనీ చెప్పారు. ఇక యాంకర్ విష్ణు ప్రియ ఇటీవల జెడి గారి తల్లి ఒప్పుకుంటే పెళ్లి చేసుకుంటా అంటూ మాట్లాడిన వాటి గురించి క్లారిటీ ఇస్తూ తాను మంచి ఫ్రెండ్ అంటూ చెప్పారు. ఇద్దరం ఒక వెబ్ సిరీస్ కోసం పనిచేశామని ఆ సమయంలో పరిచయంతో తాను అలా అని ఉండవచ్చు అంతే కానీ మా మధ్య ఎలాంటి రిలేషన్ లేదు. తాను చాలా మంచి అమ్మాయి అంటూ చెప్పారు. ఇక ఒకప్పటి గులాబీ సినిమా హీరోయిన్ మహేశ్వరి తో కూడా నాకు లవ్ స్టోరీ అంటూ చాలా మంది అనుకున్నారు కానీ అలాంటిదేమీ లేదని మేము ఇప్పటికీ మంచి ఫ్రెండ్స్ అంటూ చెప్పారు.






























