సినీ పరిశ్రమలో ప్రతి ఒక్కరూ ఉన్న స్థాయి కంటే ఒక మెట్టు ఎక్కువ ఉండాలని ప్రయత్నిస్తుంటారు..కొంత మంది ఇండస్ట్రీలో కొనసాగుతూనే ఇంకా ఇతర వ్యాపారాలు చేస్తూ ఆర్దికంగా స్థిర పడడానికి ముందంజ వేస్తుంటారు. మరి కొందరు సినిమాలు నిర్మిస్తూ ముందుకు వెళుతుంటారు. అలాంటివారిలో మొదటి వరుసలో ఉండే వ్యక్తి హీరో నాగశౌర్య

నాగ శౌర్య హీరోగా నటిస్తూనే సొంత బ్యానర్ పెట్టి తనదైన శైలిలో సినిమాలను నిర్మిస్తున్నారు. ఈ మధ్యనే అశ్వదామే సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన నాగశౌర్య ప్రేక్షకులను అనుకున్న రీతిలో సంతృప్తి పరచలేదని చెప్పవచ్చు. ఈ సినిమా కలెక్షన్ల పరంగా కన్నా కాంట్రవర్సీల పరంగా పాపులర్ అవుతుంది.

మొన్నటి వరకు డైరెక్టర్ వెంకీ కుడుములతో వచ్చిన విభేదాలు అయితే, ఇపుడు మరొక చిక్కుల్లో పడింది నాగశౌర్య అండ్ ఫ్యామిలీ. అసలు ఈ విభేదాలు ఎంటి దానికి కుటుంబంతో సంబంధం ఏమిటో తెలుసుకుందాం.

నాగ శౌర్య బ్యానర్ మొదలు పెట్టి సినిమాలు తీయడం మొదలు పెట్టాడు. దానికి సంబందించిన లావాదేవీలు అన్ని నాగశౌర్య అమ్మ, నాన్నలు దగ్గరుండి చూసుకుంటారు. తమ బ్యానర్లో “ఛలో” సినిమాతో వెంకీ కుడుములనూ ఇండస్ట్రీకి పరిచయం చేశారు. “ఛలో” సినిమా పెద్ద హిట్ కావడంతో డైరెక్టర్ గా వెంకి కుడుములకు, హీరోగా నాగ శౌర్యకి మంచి పేరు తీసుకొచ్చింది. మంచి సినిమా అందించినందుకు నాగశౌర్య తల్లి వెంకీ కుడుములకు ఒక కార్ గిఫ్ట్ గా ఇచ్చింది. ఆ తర్వత వారిద్దరికీ భేదాభిప్రాయాలు రావడం జరిగింది…

ఇదంతా చాలా కాలం క్రితం జరిగింది. అయితే ఇప్పుడు మళ్లీ తెరపైకి వచ్చింది. అశ్వద్ధామ ప్రమోషన్స్ లో భాగంగా నాగశౌర్య… “వెంకీ కుడుములకి మా అమ్మ బహుమతిగా కారు ఇస్తే అతను దాన్ని అమ్మేసి బైక్ పై తిరుగుతున్నాడు” అని కామెంట్ చేశాడు. దానికి వెంకీ కుడుముల స్పందించడం జరిగింది. మా ఇద్దరికీ అభిప్రాయభేదాలు ఉండటం నిజమే కానీ నేను ఆ కారు నీ అమ్మలేదు, అయినా ఈ విషయాన్ని ఇలా అందరి ముందు చెప్పడం ఏమి బాలేదు అని వ్యాఖ్యానించారు.

ఈ వివాదం ఇలా ఉండగా ఇపుడు కొత్తగా హీరోయిన్ మెహ్రిన్ తో నాగ శౌర్య తండ్రీ వివాదం తలెత్తింది. అశ్వద్ధామ ప్రమోషన్స్ కి హీరోయిన్ మేహ్రిన్ ని హాజరుకావాలని పిలవగానే ఆమెకు ఆరోగ్యం బాగాలేదని నేను రానని చెప్పిందట. అయినా కూడా ఆమె రావాల్సిందే అని నాగశౌర్య తండ్రి పట్టు పట్టారట, రాకపోతే హోటల్ బిల్లు కట్టను అని బెదిరించారట, ఈ విషయానికి కోపం వచ్చిన మెహ్రారిన్ చెప్పకుండా హోటల్ ఖాళీ చేసి వెళ్లిపోయిందని టాలీవుడ్ వర్గాల సమాచారం. మంచి హిట్స్ అందిస్తున్న బ్యానర్ ఇలా వరుస వివాదాలలో కూరుకుపోవడం గురించి మీడియా లో చర్చనీయాంశం అవుతుంది..
































