హ్యాపీడేస్ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి చాలా మంది నటులు పరిచయం కాగా అలా పరిచయమైన వాళ్లలో నిఖిల్ కూడా ఒకరు. హ్యాపీ డేస్ తరువాత నిఖిల్ నటించిన యువత, వీడు తేడా, స్వామి రారా, కార్తికేయ సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్టయ్యాయి. మాస్, క్లాస్, థ్రిల్లర్ అనే తేడాల్లేకుండా అన్ని జోనర్ల సినిమాల్లో నటిస్తూ నిఖిల్ సత్తా చాటుతున్నారు. తాజాగా ఒక షోకు హాజరైన నిఖిల్ ఆ షో లో తన జీవితానికి సంబంధించి ఇతరులకు తెలియని కీలక విషయాలను వెల్లడించారు.

తనకు పదివేల మంది అతిథులతో పెళ్లి చేసుకోవాలని ఉండేదని అయితే కరోనా, లాక్ డౌన్ వల్ల 50 మంది సమక్షంలో పెళ్లి జరుపుకోవాల్సి వచ్చిందని తెలిపారు. పెళ్లి చేసుకున్న తరువాత జీవితం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. తాను హ్యాపీడేస్ కంటే ముందు ఈటీవీ ఛానల్ లో చదరంగం సీరియల్ లో నటించానని ఎవరికీ తెలియని ఆసక్తికర విషయాన్ని నిఖిల్ వెల్లడించారు. చిన్నప్పటి నుంచి నటనపై ఎంతో ఆసక్తి ఉండేదని తెలిపారు.

ఇంటర్ నుంచి సినిమాల్లో అవకాశాల కోసం ప్రయత్నించానని అన్నారు. హీరోగా మరో మూడు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చానని షూటింగ్ మొదలు కావాల్సి ఉందని నిఖిల్ పేర్కొన్నారు. తల్లిదండ్రులు విద్యారంగంలో ఉన్నారని తమకు కాలేజీలు, యూనివర్సిటీలు ఉన్నాయని నిఖిల్ తెలిపారు. ఇంజనీరింగ్ చదివిన తరువాత గూగుల్ లో ఉద్యోగం వచ్చిందని….. తనకు సినిమాలపై ఆసక్తి ఉందని తల్లిదండ్రులను ఒప్పించి జాబ్ వదిలేశానని అన్నారు.

కొన్ని సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేశానని సుధీర్ వర్మ, చందు మొండేటి తనకు మంచి స్నేహితులని నిఖిల్ చెప్పారు. తనది ప్రేమ వివాహమని… ఒక బర్త్ డే పార్టీలో పల్లవిని కలిశానని చెప్పారు. తమకు కూతురు పుడితే మాయ అనే పేరు పెడతానని అన్నారు. కార్తికేయ సినిమా సమయంలో సెట్లోకి పాము వస్తే మంచి జరుగుతుందని ఎవరో చెప్పారని… షూటింగ్ సమయంలో నిజంగానే పాము వచ్చిందని నిఖిల్ వెల్లడించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here