నితిన్ కాబోయే భార్య ఎవరో తెలిసిపోయింది… ఎక్సక్లూసివ్ పిక్..!!

0
585

టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ బ్యాచులర్లలో హీరో నితిన్ ఒకడు. 36 ఏళ్ల ఈ ఎలిజిబుల్ బ్యాచ్లోర్ ఇప్పటికి పెళ్లికి రెడీ అవుతున్నాడు. 2020 సంవత్సరంలో మన టాలీవుడ్ హీరోలలో చాలా మంది పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు. ఇప్పటికే నిఖిల్ ఎంగేజ్ మెంట్ కూడా చేసుకొని వివాహ సమయం కోసం ఎదురుచూస్తున్నాడు. నితిన్ నటించిన భీష్మ మూవీ రిలీజ్ కి సిద్దంగా ఉంది… ఈ నెల 21న భీష్మ చిత్రం విడుదల కాబోతుంది. ప్రస్తుతం నితిన్ ఈ సినిమా ప్రమోషన్స్ లో బిజీగా గడుపుతున్నాడు.. ఇంతకు ముందు ఒక ఇంటర్వ్యూ లో తన ప్రేమ గురించి చెప్పాడు నితిన్. ఇపుడు ఆ అమ్మాయి ఫోటోను కూడా అభిమానుల ముందుకు తీసుకొచ్చాడు.. ఇంతకీ ఆ అమ్మాయి ఎవరంటే, హైదరాబాదకి చెందిన “శాలిని” అనే అమ్మాయి నితిన్ కి సన్నిహితుల ద్వారా పరిచయం అని ఐదు సంవత్సరాలుగా వీరిద్దరూ ప్రేమలో మునిగి తేలుతున్నారట. శాలిని యుకే లోని యూనివర్సిటీలో మాస్టర్స్ చేసింది, ఇపుడు హైదరాబాద్ కి వస్తుంది.. నితిన్ మరియు షాలిని కుటుంబ సభ్యులు ఇదివరకే వీరిరువురి పెళ్ళికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారట.. సినిమా స్టైల్ లో ఎటువంటి ట్విస్ట్ లు లేవంట నితిన్ ప్రేమ వ్యవహారంలో.. ఈ నెల 15 న ప్రీ వెడ్డింగ్ ఫంక్షన్ హైదరాబాద్ లోని నితిన్ నివాసంలో జరగనుంది. ఏప్రిల్ 15 న ఎంగేజ్మెంట్, ఏప్రిల్ 16 న దుబాయ్ లో డెస్టినేషన్ మారేజ్ చేద్దామని ఇరు కుటుంబాలు నిర్ణయించుకున్నాయి అని నితిన్ చెప్పడం జరిగింది..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here