టాలీవుడ్ యువ కథానాయకుడు నితిన్ తన వ్యక్తిగత జీవితానికి సంబంధించి ఒక శుభవార్తను పంచుకున్నారు. 2020లో షాలినీని ప్రేమ వివాహం చేసుకున్న నితిన్, గతేడాది తండ్రి అయ్యారు. అయితే, ఇప్పటివరకు తన కుమారుడి పేరును, ఫోటోలను బయటపెట్టని నితిన్ దంపతులు, శ్రీకృష్ణాష్టమి పర్వదినం సందర్భంగా తమ ముద్దుల బిడ్డను అభిమానులకు పరిచయం చేశారు.

కొడుకు పేరు ‘అవ్యుక్త్’
నితిన్ తన కుమారుడికి ‘అవ్యుక్త్’ అని పేరు పెట్టినట్లు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ పోస్ట్ క్షణాల్లోనే వైరల్ అయింది. సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్ల నుంచి ఈ కొత్త పేరుపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. పేరు చాలా కొత్తగా ఉందని, చాలా బాగుందని అందరూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
హిట్ కోసం నితిన్ ఎదురుచూపులు
వ్యక్తిగత జీవితంలో సంతోషంగా ఉన్నప్పటికీ, సినీ కెరీర్‌లో మాత్రం నితిన్ ఒక హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు. ఈ ఏడాది మార్చిలో విడుదలైన “రాబిన్ హుడ్” మరియు గత నెలలో వచ్చిన “తమ్ముడు” సినిమాలు బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచాయి.
అయితే, ఈ ఏడాది నితిన్ కొత్త సినిమా గురించి ఇండస్ట్రీలో ఒక ఆసక్తికరమైన వార్త వినిపిస్తోంది. “బలగం” సినిమాతో దర్శకుడిగా మంచి పేరు తెచ్చుకున్న వేణు యెల్దండి దర్శకత్వంలో నితిన్ ఒక సినిమా చేయనున్నారని సమాచారం. “ఎల్లమ్మ” అనే టైటిల్‌తో రానున్న ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మించనున్నారు. హీరోయిన్‌గా సాయి పల్లవి నటించే అవకాశం ఉన్నట్లు కూడా టాక్ నడుస్తోంది. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది.
































