నితిన్ ప్రస్తుతం “భీష్మ” చిత్రంతో బిజీ బిజీగా గడువుతున్నాడు. ఈనెల 21న విడుదల కాబోతున్న ఈ సినిమాకోసం తీవ్రంగా శ్రమించాడట. రశ్మిక మందన్న తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్న ఈ సినిమాకి “చలో” ఫెమ్ వెంకీ కుడుముల దర్శకతం. సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. ఈ సినిమా పై నితిన్ చాలా అసలు పెట్టుకున్నాడట. ఈ సినిమాతో ఖచ్చితంగా హిట్ కొడతాడని ఎదురు చూస్తున్నారు నితిన్ అభిమానులు. ఈ సినిమాకి సంబందించిన టీజర్, కొన్ని పాటలు ఇటీవలే రిలీజ్ అయ్యాయి. వాటికీ ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది.

ఆ మధ్య ఈ ఏప్రిల్ లో నితిన్ పెళ్లి చేసుకోబోతున్నాడన్న వార్త తెలుగునాట చక్కర్లు కొట్టింది. దీనిపై నితిన్ నుంచి ఎటువంటి స్పందన లేదు. నితిన్ ఖండించలేదు కాబట్టి నిజమే అంటున్నారు ఫాన్స్. షాలిని అనే అమ్మాయితో పీకల్లోతు ప్రేమలో మునిగిపోయిన నితిన్. వాళ్ళ ప్రేమ గురించి ఇంట్లో చెప్పడం, వారు ఒప్పుకోవడం, ఈ ఏడాది పెళ్లి చేసేయాలని నిర్ణయం తీసుకోవడం వెంట వెంటనే జరిగిపోయాయి. ఇదంతా ఊహాగానాలు కాదండి ఇటీవలే నితిన్ ఒక ఇంటర్వూలో చెప్పిన విషయమే. తాను ఈ సంవత్సరం పెళ్లి చేసుకుంటానని చెప్పడటంతో అభిమానుల ఊహాగానాలకు క్లారిటీ ఇచ్చేసాడు నితిన్. అయితే ఏప్రిల్ 15న పెళ్ళి చేసుకుంటున్నాడంటూ వార్తలు గత కొంత కాలంగా వింటూనే ఉన్నాం. తాజాగా పెళ్ళి మరో నెల రోజులు వాయిదా పడిందని ఫిలింనగర్ వర్గాల సమాచారం. కొన్ని కారణాల దృష్యా పెళ్ళి ఏప్రిల్ నుంచి మే కి షిఫ్ట్ చేసాడట నితిన్.

దుబాయిలో పలాజో వర్సాచే అనే హోటల్ వేదికగా అంగరంగ వైభవంగా నితిన్ – షాలినీలా వివాహం జరిపేందుకు నితిన్ కుటుంబ సభ్యులు అన్ని ఏర్పాట్లు చేశారట. అయితే ప్రస్తుతం మరో నెలరోజులు వాయిదా పడింది కాబట్టి వేదిక అక్కడే ఉంటుందా లేక వేరే వేదిక మర్చి ఇండియాలో జరుపుతారా అనేది ఇంకా తెలియాల్సి ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here