Hero Raja : వెన్నెల, ఆనంద్ సినిమాలతో పక్కింటి అబ్బాయిగా ముద్ర వేసుకుని అందర్నీ ఆకట్టుకున్న హీరో రాజా. అసలు పేరు రాజా అబేల్ వైజాగ్ కి చెందిన రాజా తల్లి బ్రిటిషర్ తండ్రి తమిళ బ్రాహ్మణ కుటుంబానికి చెందినవాడు. ఇక రాజా సినిమాలపై మక్కువతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు. శ్రీకాంత్ హీరోగా వచ్చిన ఓ చిన్నదాన సినిమాలో నటించాడు. హీరోగా గుర్తింపు తెచ్చుకుంది మాత్రం వెన్నెల సినిమాతో పార్వతి మెల్టన్, రాజా హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా పెద్దగా విజయం సాధించకపోయినా పార్వతి మెల్టన్ కు రాజా కు ఇండస్ట్రీలో అవకాశాలకు స్వాగతం పలికింది.

హీరో నుండి పాస్టర్ గా రాజా….
ఇక శేఖర్ ఖమ్ముల దర్శకత్వంలో వచ్చిన ఆనంద్ సినిమా ద్వారా మంచి పేరు తెచ్చుకున్నాడు. కమిలిని ముఖర్జీ, రాజా జంటగా నటించిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయాన్ని నమోదు చేయడమే కాకా మంచి అవకాశాలని కుడా అందించింది. అమ్మాయిలలో మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు. అయితే ఆ తరువాత సరైన స్టోరీలను తీసుకోకపోవడం వల్ల తనకున్న ఫ్యాన్ ఫాలోయింగ్ ను ఎక్కువ రోజులు నిలుపుకోలేక పోయాడు. మెల్లగా సినిమాల్లో కనిపించడం మానేసాడు. రాజశేఖర్ రెడ్డి గారిపైన ఉన్నా అభిమానంతో కాంగ్రెస్ పార్టీ లో చేరిన ఆయన మరణం తరువాత పార్టీ నుండి బయటికి వచ్చాడు.

ఇక తన డ్రైవర్ 7 లక్షల డబ్బు తీసుకుని పరారు అవడంతో ఆర్థికంగా కూడా దెబ్బతిన్నాను దీంతో ఒక డిప్రెషన్ లోకి వెళ్ళిపోయా ఆ తరువాత పూర్తిగా యేసు ప్రభువును ప్రార్థించడం మొదలుపెట్టాను. డబ్బే జీవితం కాదని తెలుసుకున్న అంటూ తాను పాస్టర్ గా మారడానికి దారితీసిన సంఘటనలను చెప్పారు. ఇక తన భార్య అమ్రీతా విన్సెంట్ కూడా తన మార్గంలోనే నడుస్తోందని ఒకవేళ సినిమా హీరోగా నేను ఉండుంటే తాను నాతో ఉండేది కాదని చెప్పాడు. రాజా ప్రస్తుతం హైదరాబాద్ లో పాస్టర్ గా బోధనలు చేస్తున్నారు. ఇండియాలోనే కాకుండా అమెరికాలో కూడా బోధనలు చేస్తుంటారు పాస్టర్ రాజా.



























